దోపిడీపై అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం భారత స్వాతంత్య్ర పోరాటంలో గర్వించదగిన అధ్యాయమనిరాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కొక్కనియాడారు. హైదరాబాద్‌లో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొంటూ ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు ప్రజలంతా ముఖ్యంగా యువతరం తెలుసుకోవాలని ఆమె చెప్పారు.
క్షత్రియ సేవా సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొంటూ కుల, వర్గ వివక్ష లేకుండా సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు అల్లూరి సీతారామరాజు జీవిత పాత్ర నిదర్శనమని రాష్ట్రపతి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజును గిరిజన సమాజం పూర్తిగా దత్తత తీసుకున్నదని, గిరిజన సమాజంలోని సుఖ దుఃఖాలను కూడా ఆయన తన సంతోషం, దుఃఖంగా మార్చుకున్నారని ఆమె చెప్పారు.
అతను గిరిజన యోధుడిగా గుర్తుండిపోయారని చెబుతూ అదే అతని నిజమైన గుర్తింపు అని ముర్ము తెలిపారు. బ్రిటీష్ పాలకుల అన్యాయపూరితమైన శాసనాలకు, అధికారాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన అల్లూరి నిలబడి భావితరాలకు స్ఫూర్తి నింపారని తెలిపారు. బ్రిటీష్ వారు హింసించినా, ఒత్తిడి తెచ్చినా లంగలేదని, ప్రజలపై దాడులకు వ్యతిరేకంగా నిలబడి ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు.
తన బలిదానం వరకు గిరిజన సమాజం హక్కుల కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారని చెబుతూ అటువంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుని వారసత్వాన్ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర సమరయోధుల సహకారం గురించి పౌరులందరిలో ముఖ్యంగా యువ తరానికి అవగాహన కల్పించడానికి మేధావులు, ముఖ్యంగా సామాజిక శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు కృషి చేయాలని ఆమె కోరారు.సమాజంలోని అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా, నిర్భయంగా కృషి చేయడమే అల్లూరి సీతారామరాజు జీవిత సందేశమని రాష్ట్రపతి అన్నారు. మన ప్రవర్తనలో ఆయన ఆదర్శాలను అలవర్చుకోవడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళులు అర్పించగలమని ఆమె పేర్కొన్నారు. సమాజం, దేశ ప్రయోజనాల దృష్ట్యా అల్లూరి సీతారామరాజు విలువలు, ఆదర్శాలను అందరూ అలవర్చుకోవాలని ఆమె కోరారు.
అల్లూరి గొప్పతనాన్ని, చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోరారు. అల్లూరి జయంత్యుత్సవాలు కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేశాయని చెబుతూ మహాకవి శ్రీశ్రీ అల్లూరి గురించి రాసిన ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా… మాలో నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా’ అనే పాటను చాలా ఇష్టంగా వినేవాడినని తెలిపారు.
భరతజాతి చెప్పుకొనే ఎంతోమంది అమరవీరుల సరసన మేము తక్కువ కాదని మన తెలుగుజాతిని నిలబెట్టిన గొప్ప మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకూ విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. భీమవరంలో అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లూరి సీతారామరాజును అతిథులు సన్మానించారు.గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కూడా పాల్గొన్నారు.
More Stories
భారత్ లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులు?
కేసీఆర్ బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట