హిందూ సమాజంపై దుర్మార్గమైన దాడి

హిందూ సమాజంపై దుర్మార్గమైన దాడి జరుగుతోందని, అటు క్రైస్తవులు, ఇటు ముస్లింలు  హిందూ సమాజాన్ని పీక్కుతింటున్నారని సాదు సంతులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతల ఆధారంగా.. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా మతమార్పిడి మహమ్మారి హిందుత్వం పై భీకరమైన దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మంగళవారం విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు మఠాలు పీఠాల సాధువులు సంతులు ప్రముఖులతో సమావేశం నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 110 మంది ప్రముఖ స్వామీజీలు హాజరయ్యారు. పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్  అధ్యక్షత వహించారు.

స్వామీజీలు అందరూ హిందూ ఐక్యత కోసం కట్టుబడి పని చేయాలని ప్రతినభూనారు. మతమార్పిడిని తీవ్రంగా ప్రతిఘటించాలని, ఆదర్శ హిందూ కుటుంబ జీవనాన్ని ప్రోత్సహించాలని, ప్రతి దేవాలయం హిందువులకు కేంద్రంగా చేయాలని, ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలను హిందువులకు అప్పగించి, స్వతంత్రత ప్రకటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో సాధుసంతులు విరివిగా పర్యటన చేసి హిందూ బంధువులకు భరోసానింపాలని, ప్రతి హిందువుకు హనుమాన్ చాలీసా పై అవగాహన పెంచి, హనుమాన్ చాలీసా పరాయణం చేయించాలని తీర్మానాలు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో స్వామీజీల పరిటన వల్ల సురక్ష, సేవ, సంస్కార్ ఈ మూడు గుణాలు అలవడితే హిందూ సమాజం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. మతం మారుతున్న సమాజాన్ని జాగృతం చేసి హిందూ సమాజ ఐక్యత కోసం తీవ్రంగా కృషి చేయాలని నిర్ణయించారు. మతం మారిన హిందూ సోదరులను సాధారంగా హిందుత్వంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి స్వామీజీపై ఉందని పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతి పై దాడి చేస్తున్న విదేశీ సంప్రదాయాల్ని రూపుమాపాలని చెప్పారు. పప్పు ,ఉప్పు, బియ్యానికి, రూ. 10,000కు  మతం మారుస్తున్న మిషనరీల భాగోతం ప్రపంచానికి తెలియజేయాలని స్వామీజీలు స్పష్టం చేశారు. ప్రతి దేవాలయం కేంద్రంగా హిందూ సమాజం సంగటితమై స్వావలంబన సాధించాలని సూచించారు.

కులాల పేరుతో, వర్గాల పేరుతో ఎవరికి వారుగా జీవిస్తున్న హిందూ సమాజం  మనసులో హిందుత్వాన్ని బలంగా నాటాలని చెప్పారు. దేవాలయాల భూములు, హిందువుల ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాల భరతం పట్టాలని పిలుపిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు  సంగ్రామ మహారాజ్, యోగానంద సరస్వతి, కమలానంద భారతి, దుర్గాప్రసాద్, సోమాయప్ప స్వామి, చైతన్యానంద మహారాజు తదితరులు పాల్గొన్నారు.