2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్ హౌజ్‌ను ట్రంప్ ఖాళీ చేశారు. అయినప్పటికీ ఆయన వద్ద ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసమైన మార్- ఎ- లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
దేశానికి చెందిన అత్యంత రహస్యమైన పత్రాలను ఇతర మ్యాగజైన్లు, వార్తా పత్రికల మధ్య కలిపేశారని అధికారులు వెల్లడించారు. తాజా పరిణామాలపై తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు .
“ఈ అవినీతి బైడెన్ ప్రభుత్వం.. నాపై మళ్లీ అభియోగాలు మోపింది. ఈ విషయం నా లాయర్లకు చెప్పింది,” అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇదే నిజమైతే ఫెడరల్ ఛార్జీలు ఎదుర్కొనున్న తొలి సిట్టింగ్/ మాజీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ట్రంప్ అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఈ విషయంపై అమెరికా న్యాయశాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లభించలేదు.sud

More Stories
అమెరికాలో ప్రతిభావంతులు లేరు.. విదేశీ ప్రతిభ అవసరమే
పాక్ కోర్టు ఆవరణలో భారీ పేలుడు.. 12 మంది మృతి
కొత్త హరిత ఆర్ధిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాలువెనకడుగు?