తెలంగాణాలో కాలుష్య కోరల్లో 9 నదులు 

* ప్రపంచ పర్యావరణ దినం

తెలంగాణాలో గోదావరి, కృష్ణ సహా 9 నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. నదుల్లో నీటి నాణ్యతను 42 చోట్ల పరిశీలించగా, అందులో 37 చోట్ల విపరీతమైన కాలుష్యంతో కూడిన నీళ్లు ఉన్నాయని స్టేట్స్‌‌ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌‌మెంట్ 2023 నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌‌మెంట్ అనే ప్రైవేటు సంస్థ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం.. గ్రీన్ కవర్ ఇంప్రూవ్‌‌మెంట్‌‌, మున్సిపల్ వేస్ట్‌‌ మేనెజ్‌‌మెంట్‌‌లో మంచి పనితీరు కనబర్చి ఓవరాల్ ర్యాంకింగ్స్‌‌లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది.  అయితే, నదుల కాలుష్యం, గ్రౌండ్ వాటర్‌‌‌‌ అధికంగా తోడడం, నీటి వనరులను నిరుపయోగంగా ఉంచడం వంటి అంశాల్లో తెలంగాణ పనితీరు బాగోలేదని పేర్కొంది.  రాష్ట్రంలో 19 శాతం వాటర్‌‌ ‌‌బాడీస్‌‌ (చెరువులు, కుంటలు వంటివి) నిరుపయోగంగా మారాయని తెలిపారు.

కృష్ణ, మూసీ, కరకవాగు, కిన్నెరసాని, మానేరు, మంజీర, మున్నేరు, నక్కవాగు, గోదావరి నదులు కాలుష్యం బారిన పడ్డాయని చెప్పింది. నదుల సంరక్షణలో గతంలో కంటే ప్రస్తుతం తెలంగాణ వెనుకబడిందని వెల్లడించింది.  దేశవ్యాప్తంగా 603 నదుల్లో నీటి నాణ్యతను పరిశీలించగా, 279 నదుల్లోని నీళ్లు కనీసం స్నానానికి కూడా పనికిరాకుండా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దేశంలో వాతావరణ కాలుష్యం వల్ల మానవుల జీవితకాలం తగ్గుతోందని నివేదికలో పేర్కొన్నారు. గాలి కాలుష్యం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి ఆయుష్షు 5 ఏండ్ల 2 నెలలు తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆయుష్షు 4 ఏండ్ల 5 నెలలు తగ్గిందని అంచనా వేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో రెండేండ్ల 9 నెలలు, పట్టణాలలో మూడేండ్ల మేర ప్రజల జీవిత కాలం తగ్గిందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తి, పబ్లిక్ హెల్త్, హ్యూమన్‌‌ డెవలప్‌‌మెంట్ ఇండెక్స్‌‌లో తెలంగాణ వరుసగా 19, 13, 4వ స్థానాల్లో నిలవడం గమనార్హం.

కాలుష్య కాసారాలుగా ఓరుగల్లు చెరువులు

ఇలా ఉండగా, ఓరుగల్లు చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు కాలుష్య కాసారాలుగా మారుతున్నారు. నగరంలో మురుగు కాల్వలు, నాలాల నుంచి వస్తున్న నీళ్లను శుద్ధి చేసేందుకు సీవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ) ఏర్పాటు పనులు ముందుకు సాగడం లేదు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో మూడు చోట్ల ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీలు నిర్మించాలని ప్రతిపాదించి రెండేళ్లు అవుతున్నా అవి అందుబాటులోకి రావడం లేదు.

దీంతో మురుగు నీళ్లన్నీ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెరువుల్లో కలుస్తుండడంతో అవి కలుషితం అవుతున్నాయి.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్ పరిధిలో సుమారు 135 చెరువులు ఉన్నట్లు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు చెబుతున్నారు. నగరంలో డ్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీటిని ఎక్కడికక్కడ సమీపంలోని చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారు.

తోళ్ల ఖార్ఖానా నుంచి కెమికల్స్, వృథా నీటితో దేశాయిపేట సాయిచెరువు పూర్తిగా కలుషితం అయింది. ఒకప్పుడు తాగునీటికి ఉపయోగపడిన భద్రకాళి చెరువు కూడా హంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు, జూపార్క్​పైఏరియా నుంచి వచ్చే మురుగునీటితో నిండి పోతోంది. దీంతో పాటు సిటీలోని డ్రైనేజీ, వరద నీళ్లన్నీ హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి మండలం నాగారం చెరువులోకి చేరుతుండడంతో ఆ చెరువు కూడాడేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడింది.