
ఇటీవల ఎన్ఐఏ పోలీసులు జబల్‌పుర్ జిల్లాలో ఐఎస్ఐఎస్‌తో లింకు ఉన్న టెర్రర్ మాడ్యూల్ గుట్టును రట్టు చేశారు. సయ్యిద్ మమ్మూర్ ఖాన్, మహమ్మద్ ఆదిల్ ఖాన్, మహమ్మద్ సాహిద్ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. మే 26, 27వ తేదీల్లో మొత్తం 13 ప్రదేశాల్లో నిర్వహించిన రెయిడ్లలో ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు.
ఆ గ్యాంగ్ యాంటీ-ఇండియా, యాంటీ హిందూ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. తమ మిషన్‌లో భాగంగా భారత్‌ను 2050 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని ప్లానేసినట్లు వెల్లడైంది. ఇటీవల భోపాల్, హైదరాబాద్‌లో 16 మంది యువకుల్ని పట్టుకున్న తర్వాత ఎన్ఐఏ పోలీసులు మళ్లీ రెండోసారి భారీ ఆపరేషన్ చేపట్టారు.
మొదటిసారి ఆ యువత నుంచి ఆయుధాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ సాధానాలను స్వాధీనం చేసుకున్నారు. అదిల్ ఖాన్ అనే ఉగ్రవాది సోషల్ మీడియా ద్వారా ఐఎస్ఐఎస్ ఎజెండాను ప్రచారం చేసినట్లు విచారణలో తేలింది. దవా ప్రోగ్రామ్‌ల ఆధారంగా కూడా అతను ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దవా అంటే ఇస్లాం ప్రకారం ముస్లింలు కానివారిని ఇస్లాం మతంలోకి మార్చడమన్నమాట. అరెస్టు అయిన ముగ్గురు ఉగ్రవాదులు తీవ్రంగా ర్యాడికలైజ్ అయినట్లు విచారణలో స్పష్టమైంది.
ఐఎస్ఐఎస్ ఎజెండాను ప్రమోట్ చేస్తూ భారీగా నిధులు సేకరిస్తున్నట్లు తేలింది. ఉగ్రవాద దాడుల కోసం ఆయుధాలను కూడా సేకరిస్తున్నట్లు గుర్తించారు. సయ్యిద్ అలీ ఓ వాట్సాప్ గ్రూపు ద్వారా అక్రమంగా పిస్తోళ్లను సేకరిస్తున్నట్లు తేలింది. అదిల్ అనే వ్యక్తి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఛానళ్ల ద్వారా యువతను ఐఎస్ఐఎస్ వైపు మోటివేట్ చేస్తున్నాడు.
More Stories
సిక్కింని ముంచెత్తిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
గంట వ్యవధిలో నేపాల్ నుండి నాలుగు భూకంపాలు
41 మంది కెనడా దౌత్యవేత్తలకు దేశం వదిలి వెళ్ళమని ఆదేశం