మ‌ణిపూర్ అల్ల‌ర్లలో మ‌రో ఐదుగురు మృతి

మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కేంద్రమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన రానున్న ఈ నేపథ్యంలో మరోమారు అల్లర్లు రేకెత్తాయి. ఈ ఘటనలో ఓ పోలీసు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 80కి పెరిగింది.
 
 కాగా, మణిపూర్‌లో రిజర్వేషన్ తెచ్చిన వివాదం గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో అల్లర్లకు కారణం అయింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ బంద్ చేసిన విషయం తెలిసిందే. అలాగే నాలుగు రోజుల్లో 40 మంది సాయుధ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
 
దీంతో మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింసలో ఒక పోలీసు సహా మొత్తం ఐదుగురు మరణించారు. అలాగే మరో 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవంక, ఆదివారం సాయంత్రం ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో ఆర్మీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు దుండగులు పట్టుబట్టారు. ఈ విషయాన్ని ఇండియన్‌ ఆర్మీ వెల్లడించింది.
 
దుండగులతోపాటు భారీగా మారణాయుధాలు పట్టబడ్డాయని పేర్కొంది. నిందితుల నుంచి మ్యాగీజన్‌తో కూడిన ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, మొత్తం 60 రౌండ్ల 5.56 ఎంఎం మందుగుండు సామాగ్రి, చైనాకు చెందిన హ్యాండ్‌ గ్రనేడ్‌, డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.