
వరుసగా రెండు త్రైమాసికాల క్షీణత సాంకేతిక మాంద్యాన్ని ఏర్పరుస్తుంది. ఈ గణాంకాలు జర్మన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా నిపుణులు పేర్కొంటున్నారు. జీడీపీలో పెరుగుదల 0.2 శాతం విస్తరణతో కొసాగుతుందనే జనవరి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇక ఇప్పుడు ఈ అంచనాలను దిగువ దిశగా సవరించాల్సిన అవసరం ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
అధిక ద్రవ్యోల్బణం వినియోగదారుల వ్యయాల్ని ప్రభావితం చేసినట్లు డెకాబ్యాంక్ విశ్లేషకుడు ఆండ్రియాస్ స్క్యూర్లే చెప్పారు. ఏప్రిల్‌లో ధరలు ఏడాది క్రితం కంటే 7.2 శాతం ఎక్కువగా నమోదయ్యాయని గుర్తుచేశారు. దానితోపాటు గృహవినియోగం ధరలు, కాలానుగుణ, క్యాలెండర్ సర్దుబాట్ల తర్వాత త్రైమాసికానికి 1.2శాతం తగ్గింది.
ఏప్రిల్‌లో జర్మనీలో ద్రవోల్యబణం 7.2 శాతంగా ఉండగా, ఇది యురో సగటు కన్నా ఎక్కువ. అధిక ధరల భారం ప్రజలపై పడింది. దీంతో ఆహారం, దుస్తులు, ఫర్నీచర్ కొనడం కోసం ప్రజలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. అధిక ఇంధన ధరల వల్ల పరిశ్రమల ఉత్పత్తులకు ఆర్డర్లు తగ్గినట్లు గుర్తించారు. ఏడాది ఆరంభం నుంచి ధరలు అధికంగా ఉండడం వల్ల జర్మనీ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడినట్లు డీస్టాటిస్ ఏజెన్సీ తెలిపింది.
డాలర్ విలువ రెండు నెలల గరిష్ఠానికి చేరుకుంది. తాజాగా రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అమెరికా ‘ఎఎఎ’ డెబిట్ రేటింగ్ నెగెటివ్ పరిశీలనలో ఉంది. చట్టసభ సభ్యుల నుంచి రుణ పరిమితి పెంపునకు అనుమతి పొందడంలో విఫలమైతే డౌన్‌గ్రేడ్ అవకాశముందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.
అయితే ప్రభుత్వ వ్యయం కూడా త్రైమాసికంలో గణనీయంగా 4.9 శాతం మేరకు తగ్గింది. వెచ్చని శీతాకాల వాతావరణం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం, చైనీస్ పున:ప్రారంభం, సరఫరా గొలుసు ఘర్షణల సడలింపు, ఆర్థిక వ్యవస్థను మాంద్యం ప్రమాద జోన్ నుండి బయటపడటానికి సరిపోవని ఐఎన్‌జి గ్లోబల్ హెడ్ ఆఫ్ మాక్రో కార్ట్సన్ బ్రజెస్కీ చెప్పారు.
More Stories
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం.. అందుకే సీబీఐ విచారణ
మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్