రోజుకో వివాదం రాజేస్తున్న తెలంగాణ విసి గుప్తా

తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలకు పరిష్కరించే ప్రయత్నం చేయాల్సింది పోయి వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా రోజుకో వివాదాన్ని రాజేస్తుండడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తన ఆదేశాలకు విలువ లేకపోవడం, సిబ్బంది ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వీసీ అసహనంతో వ్యవహరిస్తున్నారు. వీసీ రవీందర్​ ఓయూకు చెందిన ప్రొఫెసర్​ నిర్మలాదేవిని రిజిస్ట్రార్​గా నియమించగా, దాన్ని రద్దు చేస్తూ ఈసీ మళ్లీ యాదగిరినే కొనసాగిస్తూ తీర్మానం చేసింది.
ఈ క్రమంలో సోమవారం రిజిస్ట్రార్​ కుర్చీలో ఎవరూ కూర్చోవడానికి వీల్లేదని, అప్పటిదాకా ఆ రూమ్​ తాళం తీయొద్దని వీసీ సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఈసీ సభ్యులు విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లగా, మరోవైపు బీజేపీ నాయకులు, వర్సిటీ విద్యార్థులు గవర్నర్​ డా. తమిళిసై సౌందరరాజన్ ని కలిసి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్​ దెబ్బతినే ప్రమాదం ఉందని, అయినా సర్కారు స్పందించడం పేర్కొంటూ  ఛాన్సలర్​ హోదాలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు.      
 
ఈసీ నియమించిన రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరికి సహాయ నిరాకరణ చేసే విధంగా సిబ్బందిని అక్కడి నుంచి విసి తొలగించడంతో గందరగోళం కొనసాగుతున్నది. మరోవైపు యూనివర్సిటీలో తన ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వీసీ విడుదల చేసిన తాజా సర్క్యూలర్‌ దుమారం రేపుతున్నది. రెండేండ్ల కాలం నుంచి 
 
రెండేండ్ల కాలం నుంచి యూనివర్సిటీలో నిత్య వివాదాలతో రాష్ట్ర స్థాయిలో పరువు పోతున్నా పరిస్థితిలో ఎంతకూ మార్పు కనిపించడం లేదు. పాలకవర్గంలో నిర్ణయించిన మేరకు ప్రస్తుతం ప్రొఫెసర్‌ యాదగిరి మాత్రమే రిజిస్ట్రార్‌గా కొనసాగే అవకాశాలున్నట్లుగా ప్రభుత్వం చెబుతున్నది.
 
 కానీ అందుకు విరుద్ధంగా వీసీ మాత్రం కొత్త రిజిస్ట్రార్‌ నియామకానికి ఉత్తర్వులే జారీ కాలేదని ఇప్పుడు న్న రిజిస్ట్రార్‌ నియామకం చెల్లుబాటే కాదని ఖరాకండిగా చెప్పడం అయోమయంగా మారింది. ఈ నెల 25న హైదరాబాద్‌లో పాలకవర్గ సమావేశం ఉంది. ఇంతలో ఎలాంటి వైపరీత్యాలు టీయూలో వెలుగు చూస్తాయోనన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నది.
 
క్రిమినల్‌ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడంతో ఈసీతో కలిసి పని చేస్తానంటూ చెప్పి అంతలోనే మాట మార్చడం, ఈసీకి వ్యతిరేకంగా నిర్ణయాలను విసి ప్రకటించడంతో ఇంతలోనే ఏం జరిగిందనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఓయూ నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ నిర్మలాదేవిని భయభ్రాంతులకు గురి చేసి వెళ్లగొట్టారంటూ ఆరోపణలు సైతం చేశారు.
 
రవీందర్ గుప్తా వీసీగా చార్జి తీసుకున్నాక ఈసీ సభ్యుల ఆమోదం లేకుండా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విచారించడానికి త్రీమెన్​ కమిటీని నియమించారు. ఆ కమిటీ సభ్యులు ఆఫీసు రికార్డులు పరిశీలించే వీలులేకుండా వీసీ సోమవారం సర్క్యులర్​ జారీ చేశారు. తన ఆమోదం లేకుండా ఎవరికీ ఫైళ్లు చూపొద్దని వర్సిటీలోని శాఖలకు లెటర్​ పంపారు.