భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఎల్ఓఎస్ కమాండర్ రాజేశ్ కాగా మరొకరు సీఎన్ఎం కమాండర్ నందా ఉన్నట్లు తెలుస్తోంది.
చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఈ భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టు మృతి చెందిన సంఘటనా స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. పోలీసులెవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తూ ఉంటారు. దీంతో వారిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ బలగాలు ఎప్పుడూ కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటారు.

More Stories
స్వతంత్ర భారత చరిత్రలో హైదరాబాద్ సంస్థానం విమోచన ఓ కీలక ఘట్టం
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు సిఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్ విముక్తి పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి