హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. చాపకింద నీరులా డ్రగ్స్ మాఫియా నగరంలో విస్తరిస్తూనే ఉంది అని చెప్పడానికి తాజాగా అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాదులో ఐదుగురి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయనను స్వాధీనం చేసుకుని కనీసం వారం రోజులైనా కాకముందే మళ్లీ తాజాగా కోట్ల విలువ చేసే కొకైన్ ను పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది.
 
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు,రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఎవరికీ పట్టుబడకుండా రహస్యంగా ఈ దందాను చేస్తున్నారు.  ఇక తాజాగా హైదరాబాదులో మరో డ్రగ్స్ ముఠా ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
వారి వద్దనుండి కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్ ను సీజ్ చేశారు.  డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  వీరంతా విదేశాల నుండి కొకైన్ తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్న క్రమంలో పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
పోలీసులు పట్టుకున్న ఆ డ్రగ్ కింగ్ పిన్ ఎవరు? ఈ ముఠా ఎంతకాలంగా దందా చేస్తుంది? ప్రధానంగా హైదరాబాదులో ఉన్న ఏ ప్రాంతాలలో వీరు తమ దందాను సాగిస్తున్నారు? వంటి వివరాలను త్వరలోనే పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది.