కోహ్లీ, గంభీర్ లకు భారీ జరిమానా

ఐపీఎల్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ, ల‌క్నో జ‌ట్టు మెంట‌ర్ గౌతం గంభీర్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగింది. ఆ ఇద్ద‌రూ మైదానంలోనే గొడ‌వ ప‌డ్డారు. సోమ‌వారం ల‌క్నోతో జ‌రిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజ‌యం సాధించింది. 127 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో ఆ టార్గెట్‌ను అందుకోలేక‌పోయింది. అయితే విక్ట‌రీ త‌ర్వాత ప్లేయ‌ర్లు క‌ర‌చాల‌నం చేసుకుంటున్న స‌మ‌యంలో.. కోహ్లీ, గంభీర్ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ ఇద్ద‌రూ దూషించుకుంటున్న స‌మ‌యంలో..ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు కూడా వారితోనే ఉండిపోయారు. ఆ ఇద్ద‌ర్నీ కేఎల్ రాహుల్ ఆపేందుకు ప్ర‌య‌త్నించాడు.
 
హ్యాండ్ షేకింగ్ స‌మ‌యంలో ల‌క్నో బ్యాట‌ర్ కైల్ మేయ‌ర్స్‌.. కోహ్లీ వ‌ద్ద‌కు వెళ్లి ఏదో మాట్లాడాడు. ఆ టైమ్‌లో గంభీర్ అక్క‌డ‌కు వ‌చ్చి మేయ‌ర్స్‌ను తీసుకువెళ్లాడు. ఆ స‌మ‌యంలోనే కోహ్లీ, గంభీర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మొద‌లైంది. ఏదో చ‌ర్చించుకున్న కోహ్లీ, గంభీర్‌లు ఓ ద‌శ‌లో దూషించుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. గంభీర్‌ను, కోహ్లీని స‌రేట్ చేసిన రాహుల్ ఆ త‌ర్వాత ఆర్సీబీ బ్యాట‌ర్‌తో మాట్లాడాడు.
 
మైదానంలోనే ఘ‌ర్ష‌ణ ప‌డ్డ ల‌క్నో మెంట‌ర్ గంభీర్‌, ఆర్సీబీ బ్యాట‌ర్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహ‌కులు ఫైన్ వేశారు. ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌కు మ్యాచ్ ఫీజులో వంద శాతం జ‌రిమానా విధించారు. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు ఇద్దరూ అంగీక‌రించారు. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఆర్టిక‌ల్ 2.21 ప్ర‌కారం ఫైన్ వేశారు. ల‌క్నో బౌల‌ర్ న‌వీన్ ఉల్ హ‌క్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానా విధించారు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్
 
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా జ‌ట్టు టాప్ ప్లేస్ కొట్టేసింది. ఆస్ట్రేలియాను వెన‌క్కి నెట్టేసి రోహిత్ శ‌ర్మ జ‌ట్టు వార్షిక ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని కైవ‌సం చేసుకున్న‌ది. ఐసీసీ మంగళవారం ఆ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దాదాపు 15 నెల‌ల పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు రెండ‌వ స్థానానికి ప‌డిపోయింది.
 
జూన్‌లో జ‌ర‌గ‌నున్న ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్‌కు ముందే ఐసీసీ త‌న ర్యాంకింగ్స్ జాబితాను స‌వ‌రించింది. అయితే వ‌చ్చే నెల‌ ఏడో తేదీన ప్రారంభంకానున్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ఆస్ట్రేలియాతో భారత్ త‌ల‌ప‌డ‌నుంది.  ర్యాంకింగ్స్ విడుదలకావ‌డానికి ముందు ఆస్ట్రేలియా 122 పాయింట్ల‌తో తొలి స్థానంలో ఉంది. భారత్ 119 పాంయిట్ల‌తో రెండో స్థానంలో ఉండేది. అయితే మే 2020 నుంచి మే 2022 లోపు ముగిసిన అన్ని సిరీస్‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తాజా ర్యాంకింగ్స్‌ను రూపొందించారు.దీంతో ఇటీవ‌ల పాక్‌, కివీస్‌ల‌పై ఆసీస్ నెగ్గినా, ఆ జ‌ట్టుకు పాయింట్లు క‌లిసిరాలేదు. దాని వ‌ల్ల ఆస్ట్రేలియా రేటింగ్ 121 నుంచి 116 పాయింట్ల‌కు ప‌డిపోయింది. ఇక భారత్ విష‌యంలో 2019లో కివీస్‌తో జ‌రిగిన సిరీస్ ఓట‌మిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. దీంతో భార‌త్‌కు రెండు పాయింట్లు జ‌త క‌లిశాయి. దీని వ‌ల్ల 119 పాయింట్ల నుంచి 121 పాయింట్ల‌కు భారత్  చేరుకున్న‌ది.