
గత నెల 22వ తేదీన పీఎస్‌ఎల్‌వీ -సీ55 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే మూడు నెలల్లో మూడు భారీ ప్రయోగా లకు ఇస్రో శ్రీకారం చుట్టింది. జూలై నాటికి ఈ మూడు భారీ ప్రయోగాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇస్రో ముందుకు సాగుతోంది.
జాబిల్లి రహస్యాలను ఒడిసిపట్టిన ఇస్రో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చంద్రయాన్ -3 మిషన్‌ను మరో రెండునెలల్లో ప్రయోగించనుంది. అత్యంత శక్తివంతమైన వాహననౌక లాంచ్ వెహికల్ మార్క్(ఎల్‌వీఎం)-3 ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. చంద్రుని ఉపరితలంపై సురక్షి తమైన ల్యాండింగ్ చేయడంతో పాటు రోవింగ్‌లో ఎండ్ టూ ఎండ్ సామార్థ్యాన్ని ప్రదర్శించేలా ప్రాజెక్టును రూపొం దిస్తున్నారు.
ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో చంద్ర యాన్ -2 లాగనే దీని నిర్మాణం ఉంటుంది. గతంలో ల్యాండింగ్ సంద ర్భంగా ఏర్పడిన ఇబ్బందులను అధికమించేలా శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. దీంతో పాటు దేశ తొలి సోలార్ మిషన్ ప్రయోగం ఆదిత్య -ఎల్1 ప్రయో గాన్ని పీఎస్‌ఎల్‌వీ వాహ కనౌక ద్వారా ఇస్రో చేపట్టనుంది.
సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలలో తేడాలు, సౌర తుఫా న్లు, అక్కడి పేళ్లులకు గల కారణాలు, దాని వల్ల భూమిపై వచ్చే విపత్తులు నుంచి రక్షణ పొందడానికి మానవాళి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అధ్యాయ నానికి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. అదేవిధంగా దేశ రక్షణలో పూర్తి సమాచార వ్యవస్థ కోసం నిర్ధేశించిన నావిక్ ఉపగ్రహాన్ని మరింత ఆధునీకరించి అభివృద్ది చేస్తోంది.
భారతదేశ జీపీఎస్, సైనిక, ప్రజావరాలకు వీలుగా రూప కల్పన చేసిన నావిక్‌ను దళలవారీగా అభివృద్ది చేయడం ఇస్రో లక్ష్యం. ఇప్పటికే 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో తాజాగా మరో ఉపగ్రహ ప్రయోగం చేప ట్ట నుంది. నావిక్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తే రక్షణతో పాటు భౌగోళిక స్థితిగతులను అంచనా వేయవ చ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి త్వరలోనే తుది తేదీని ప్రకటించనుంది.
More Stories
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనే లేదు
మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్ట్