షార్జా జైలులో బాలీవుడ్ నటి పెరీరియా

బాలీవుడ్ నటి క్రిస్సన్ పెరీరియాను డ్రగ్స్ రవాణా కేసులో యుఎఇ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె షార్జా సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 1న ఆమెను షార్జా ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. పెరీరియా తీసుకువెళుతున్న మెమొంటో అడుగుభాగంలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేశారు.

అయితే ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు క్రిస్సన్ పెరీరాపై కుట్ర జరిగినట్లు వెల్లడించారు. ముంబయిలోని ఆమె నివాసించే భవనంలో ఓ కుక్క కోసం జరిగిన వివాదం కారణంగా ఆమెపై కుట్రపన్ని డ్రగ్స్ కేసులో ఇరికించినట్లు తెలిపారు. ఈ కేసులో పోలీసులు బేకరీ యజమాని ఆంటోనీ పాల్, ఓ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేశ్ బాబ్హాటేను అరెస్టు చేశారు.

వీరు ముంబయి సబర్బన్ మీరా రోడ్డు ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఆంటోని షార్జా టికెట్‌ను పెరీరియా కోసం బుక్ చేశాడు. నకిలీ రిటర్న్ టికెట్‌ను కూడా క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ సావంత్ తెలిపారు.

ఆంటోని సోదరి పెరిరియా తల్లితో కుక్క విషయమై గొడవపడిందని, ఇదే విషయమై ఆంటోనీతో కూడా నటి తల్లి గొడవపడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. వీరంతా ఒకే భవనంలో ఉంటుని పేర్కొన్నారు. రాజేశ్ అనే వ్యక్తిని ఆంటోనీ పెరీరియా వద్దకు పంపి షార్జాలో వెబ్‌సిరీస్ ఆడిషన్‌కు వెళ్లాల్సిందిగా మెమొంటోను తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు.

దాంట్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఉండటంతో ఆమె షార్జా ఎయిర్‌పోర్టులో లాండ్ అవగానే అప్పటికే డ్రగ్స్ సమాచారం అందడంతో పెరీరియాను పోలీసులు అరెస్టు చేశారు. పెరీరియా సడక్ 2, బాట్లాహౌస్ చిత్రాల్లో నటించారు.