
ప్రముఖ నటుడు శరత్ బాబు (72) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం ఆయనను బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో కీలక అవయవాలైన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు పాడైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించినట్లు తెలిసింది.
కాగా, తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించారు. ఈయన ఆసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం.
ఆ తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించారు. మూడు నంది పురస్కారాలను అందుకున్నారు.
More Stories
ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం