ఐపీఎల్ ముంబై జట్టులో అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రం

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-11 సీజన్‌లో 22వ మ్యాచ్‌లో  ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున తుదిజట్టులో మొదటిసారిగా మొదటిసారిగా చోటు దక్కింది. ఆరగ్రేటంలోనే అరుదైన ఘనత సాధించాడు.  కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌ 2023లో రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన జూనియర్ టెండూల్కర్ 17 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్‌లో నిజానికి బెస్ట్ ఫిగర్సే.  అర్జున్ మైదానంలో అడుగుపెడుతూనే అత్యంత అరుదైన రికార్డును తనపేర రాసుకున్నాడు. తండ్రి తర్వాత కుమారుడు కూడా అదే ఫ్రాంచైజీకి ఆడడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన తండ్రీ కొడుకులుగా సచిన్, అర్జున్ రికార్డులకెక్కారు.

టాస్‌ గెలిచి మొదట బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై కొత్త బంతిని ఈ 23 ఏండ్ల ఆల్‌రౌండర్‌ చేతిలో పెట్టింది. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన అర్జున్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు అర్జున్‌కు రోహిత్‌ శర్మ జట్టు క్యాప్‌ అందించాడు.

అర్జున్‌ను 2021లో తొలిసారిగా ముంబయి ఇండియన్స్ కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.  వరుసగా రెండు సీజన్లలో బెంచ్‌కే పరిమితమైన సచిన్‌ తనయుడికి ఎట్టకేలకు మూడో సీజన్‌లో ఆడే అవకాశం దొరికింది. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముంబయి మొదట ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కడుపునొప్పితో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
 
ఇక అర్జున్‌ గత కొద్ది రోజులుగా తండ్రి సచిన్‌ పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ చేస్తూ వస్తున్నాడు. సచిన్‌ కుడిచేతి వాటం బ్యాట్‌మెన్‌ కాగా, అర్జున్‌ ఎడమ చేతివాటం బౌలర్‌ కావడం విశేషం. అర్జున్ ఇప్పటికే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడాలనే  కల నెరవేరింది.  అర్జున్‌ టెండూల్కర్‌ 2021లో హర్యానాపై తొలిసారిగా ముంబయి తరఫున టీ20లో అరంగేట్రం చేశాడు.
నవంబర్ 2022లో గోవాపై తన లిస్ట్-ఏ మ్యాచ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాతి నెలలో రాజస్థాన్‌పై గోవా తరఫున రంజీ ట్రోఫీలో ఆడాడు.  ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేయడంతో పాటు అర్జున్ 12 వికెట్లు తీశాడు. అదే సమయంలో, అతను 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు కూల్చాడు. తొమ్మిది T20 మ్యాచుల్లో 12 వికెట్లు సాధించాడు. వాస్తవానికి ఐపీఎల్‌ వేలంలో అర్జున్‌ను తీసుకురావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
 
 అదే సమయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సచిన్‌ సైతం ముంబయి ఇండియన్స్‌కు జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌ వీడ్కోలు పలికిన అనంతరం ముంబయి ఇండియన్స్‌కు మెంటార్‌గా కొనసాగుతున్నాయి.