విశాఖ స్టీల్ ప్లాంట్ ను అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ రాజకీయాలు వైసిపి, బిఆర్ ఎస్ లు చేస్తున్నాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాలు లేకుండా కేంద్రం చర్యలు చేపడుతున్నదని, దానిని అర్ధం చేసుకోకుండా తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు బావోద్వేగ రాజకీయ మంట పెడుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసిపి, బిఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మాబొరుసులాంటివని సంజయ్ విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలు సెంటిమెంట్ రగిలిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకరి స్వార్థం కోసం మరొకరు వ్యవహరిస్తున్నారని, స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
విశాఖ ఉక్కు కొనే డబ్బుంటే రాష్ట్రంలో బయ్యారం ఫ్యాక్టరీ, నిజాం షుగర్స్ తెరవొచ్చు కదా అని తెలంగాణ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. వైసిపి, బిఆర్ ఎస్ ల మైత్రీ బంధం ఎప్పటి నుంచో కొనసాగుతున్నదని ఆయన స్పష్టం చేశారు.
More Stories
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు