”సాధారణం కంటే తక్కువ” రుతుపవన వర్షాలు

భారత్‌లో ”సాధారణం కంటే తక్కువ” రుతుపవన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదనీ, ఎల్‌-నినో వచ్చే అవకాశం ఉందనీ, ఇది సాధారణంగా ఆసియాకు పొడి వాతావరణాన్ని తెస్తుందని ప్రయివేట్‌ వాతావరణ అంచనా ఏజెన్సీ స్కైమెట్‌ తెలిపింది.
”ఎల్‌ నినో సంభావ్యత పెరుగుతోంది . రుతుపవనాల సమయంలో దాని సంభావ్యత ఎక్కువగా పెరుగుతోంది. ఎల్‌ నినో తిరిగి బలహీనమైన రుతుపవనాలను సూచించవచ్చు,” అని స్కైమెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జతిన్‌ సింగ్‌ తెలిపారు. భారతదేశంలో రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 94% ఉంటుందని స్కైమెట్‌ పేర్కొంది.
 
ఉప-సమృద్ధి రుతుపవనాల మునుపటి వీక్షణను అలాగే ఉంచింది. జూన్‌లో ప్రారంభమయ్యే నాలుగు నెలల సీజన్‌లో 50 సంవత్సరాల సగటు 88 సెంటీమీటర్ల (35 అంగుళాలు)లో 96% , 104% మధ్య సగటు లేదా సాధారణ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసింది.
 
కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత వాతావరణ శాఖ తన వార్షిక రుతుపవనాల సూచనను త్వరలో ప్రకటించనుంది. నీటిపారుదల సౌకర్యం లేని భారతదేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూమి వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి , సోయాబీన్స్‌ వంటి పంటలను పండించడం జూన్‌-సెప్టెంబర్‌ వర్షాలపై ఆధారపడి ఉంటుంది.
 
దేశంలోని ఉత్తర , మధ్య ప్రాంతాలు వర్షాభావానికి గురయ్యే ప్రమాదం ఉందని స్కైమెట్‌ అంచనా వేసింది. ఉత్తర భారత వ్యవసాయ క్షేత్రంగా పేరొందిన పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ , ఉత్తరప్రదేశ్‌లలో సీజన్‌ 2వ సగభాగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
 
ఈలోపు అకాల వర్షాలు , వడగళ్ల వానలు పడ్డాయని తెలిపింది. భారతదేశం యొక్క సారవంతమైన ఉత్తర, మధ్య , పశ్చిమ మైదానాలలో గోధుమ వంటి పంటలను ఇవి దెబ్బతీశాయి, వాతావరణ సమతుల్యత లేకపోవటంతో  వేలాది మంది రైతులు నష్టాలకు గురికావడం , ఆహార ధరల ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని స్కైమెట్‌ రిపోర్టులో ప్రస్తావించింది.