సుకేశ్ మరో బాంబు … బిఆర్ఎస్ ఆఫీస్ లో ఎమ్యెల్సీ కోసం రూ 15 కోట్లు?

Sukesh Chandrasekhar.

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ లక్ష్యంగా మరో సంచలన ఆరోపణ చేసాడు. జైలు నుంచి  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెండు పేజీల లేఖను విడుదల చేశాడు.  కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనతో తాను హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీసులో మద్యం కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న అరుణ్ పిల్లైకు రూ.15 కోట్లు ఇచ్చానని ఆ లేఖలో ఆరోపించాడు.

అంతేకాకుండా బీఆర్ఎస్ నేతతో జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా లేఖలో ప్రస్తావించాడు. తనతో చాట్ చేసిన వ్యక్తి సౌత్ గ్రూప్‌లోని బీఆర్ఎస్ నేత అని తెలిపాడు. రేంజ్ రోవర్ (కారు నెం 6069) పార్క్ చేసిఉందని సుఖేష్ పేర్కొన్నాడు. ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని పేర్కొనడం ద్వారా పరోక్షంగా ఎమ్యెల్సీ కవిత కారు అన్నట్లు సంకేతం ఇచ్చాడు.

ఆ టీఆర్ఎస్ నేత ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. తన సహాయకుడు ఏపీ (అరుణ్ పిళ్ళై)కి రూ. 15 కోట్లు ఇవ్వాల్సిందిగా ఆ టీఆర్ఎస్ నేత చాట్‌లో స్పష్టంగా చెప్పారని, రూ. 15 కోట్లను 15 కేజీల నెయ్యిగా పేర్కొన్నారని సుకేశ్ తెలిపారు.

తన దగ్గర నుంచి క్యాష్ బాక్సులను తీసుకున్న పిళ్ళై వాటిని నలుపు రంగు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ (రిజిస్ట్రేషన్ నెంబర్ 6060)లో పెట్టారని చెప్పారు. ఆ కారు విండ్‌షీల్డ్‌పై ఎమ్మెల్సీ అనే స్టిక్కర్ కూడా ఉందని తెలిపారు. చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ – టీఆర్ఎస్ మధ్య ఉన్న ఆర్థిక, వ్యాపార బంధాలు స్పష్టమవుతున్నాయని, ఇప్పుడు విడుదల చేస్తున్న చాట్ స్క్రీన్ షాట్లు కేవలం స్టార్టర్లు మాత్రమేనని, అసలు కథ ఇంకా చాలా ఉందని వెల్లడించాడు.

తాను మాట్లాడే ప్రతి మాటకు తన దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే నార్కో అనాలిసిస్, పాలీగ్రాఫ్ టెస్టులను ఎదుర్కోడానికి కూడా తాను సిద్ధమని సుకేశ్ చంద్రశేఖర్ స్పష్టం చేసాడు. కేజ్రీవాల్ అవినీతి బండారం మొత్తం బయటపడుతుందని తెలిపాడు.  ఆ డబ్బు అందినట్టు టీఆర్ఎస్ నేత చేసిన చాట్ స్క్రీన్ షాట్లు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించాడు. తన స్వదస్తూరీతో రాసిన లేఖను న్యాయవాదుల ద్వారా మీడియా సంస్థలకు విడుదల చేసాడు.

సుఖేష్‌ చంద్రశేఖర్‌ మార్చి 31న కూడా ఓ సంచలన లేఖను విడుదల చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పినట్టు బీఆర్ఎస్ నేతకు రూ.75 కోట్లు ఇచ్చానని ఆ లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తి రూ. 15 కోట్లు ఇచ్చానని తెలిపాడు.

 2020లో సీఎం కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ చెప్పినట్లు బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానని చెప్పాడు.  ఏపీ లిక్కస్ స్కాం కేసు నిందితుల్లో ఒకరని  కూడా పేర్కొన్నాడు.   చాటింగ్ లో కొన్ని కోడ్ పదాలు వాడినట్టు చెప్పాడు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించానని తెలిపాడు.

త్వరలో కేజ్రీవాల్ తో తాను చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు పెడతానని ప్రకటించాడు.  ఈ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌తో తాను మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేశానని తెలిపాడు. కేజ్రీవాల్‌కు రూ. 75 కోట్లు డెలివరీ చేశాడని వెల్లడించాడు