క్యాన్సర్ ను నయం చేసే మందు పేరుతో నాసిరకం మందు తయారు చేస్తున్న సెలాన్ ఫార్మా కంపెనీ లైసెన్సును అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నకిలీ మందుల విషయంలో ఇటీవల డబ్ల్యూహెచ్ వో అలర్ట్ చేయడంతో మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్న 100 కు పైగా కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అధికాసోదాలు జరిపారు. ఇందులో 18 కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు.
నోయిడాలో తయారైన మందుల వాడిన పలువురు ఉజ్బెకిస్తాన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటనతో డబ్ల్యూ హెచ్ వో ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ, నాసిరకం మందుల తయారీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో నోయిడా లోని మెయిడెన్ ఫార్మా పై మొదట దాడి డ్రగ్ కంట్రోల్ అధికారులు చేశారు. అక్కడ ఉన్న ఔషధాలను పరిశీలించగా అందులో ఎతిలిన్ గ్లైకోల్, డీ ఎథిలిన్ గ్లైకోల్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించడంతో వెంటనే మెయిడెన్ ఫార్మా లైసెన్సును రద్దు చేశారు.
కాగా, గత కొంత కాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఈడీ విస్తృతంగా సోదాలు చేస్తోంది. రాజకీయ నేతలకు చెందిన కంపెనీల్లో సోదాలు చేపట్టడమే కాదు… విచారణ కూడా చేసింది. కొద్దిరోజుల క్రితమే నగరంలోని దాదాపు 10 చోట్ల సోదాలు నిర్వహించారు. వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న నకిలీ కన్సల్టెన్సీ సంస్థలను ఈడీ గుర్తించింది. గచ్చిబౌలిలోని ఎఎస్ బీఐకి చెందిన సైడ్ అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించింది. వీటన్నింటి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.

More Stories
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదలపై రాజీలేని పోరాటం
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన ఇడి
కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘జేవీ లూట్’పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి