18 ఫార్మా కంపెనీల లైసెన్సుల రద్దు

నకిలీ, ప్రాణాంతక ఔషధాలను తయారు చేస్తున్న 18 ఫార్మా కంపెనీల లైసెన్స్ లను కేంద్రం రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీసీజీఐ దాడులు చేసింది.  ఇటీవల భారత్ తయారీ ఔషధాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. భారత్ తయారీ దగ్గు మందు వల్ల గాంబియాలో చిన్నపిల్లలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.

మరోవైపు, భారత్ లో తయారైన పలు ఔషధాలను అమెరికా వెనక్కు తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీసీజీఐ దాడులు చేసింది. ఫార్మా ప్రమాణాలకు అనుగుణంగా లేని, నకిలీ, ప్రాణాంతక ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న 18 ఫార్మా కంపెనీల  లైసెన్స్ లను కేంద్రం రద్దు చేసింది.

దేశవ్యాప్తంగా 76 ఫార్మా కంపెనీలపై డీసీజీఐ  అధికారులు దాడులు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 203 ఫార్మా కంపెనీలు ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాలను ఉత్పత్తి చేయడం లేదని ప్రభుత్వం గుర్తించింది.

అందులో ఫేజ్ 1లో భాగంగా గత 15 రోజులుగా 76 ఫార్మా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించింది. వాటిలో 18 ఫార్మా కంపెనీల లైసెన్స్ లను రద్దు చేసింది. 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న ఫార్మా కంపెనీల్లో అత్యధికం హిమాచల్ ప్రదేశ్ (70), ఉత్తరాఖండ్ (45), మధ్యప్రదేశ్ (23) ల్లో ఉన్నాయి.