దేశంలో లక్ష ప్రదేశాలకు విస్తరించే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరుగా 71,355 చోట్ల పనిచేస్తూ సామాజిక పరివర్తన కోసం కృషి చేస్తున్న  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాబోయే ఒక సంవత్సరంలో, దేశం అంతటా సుమారు లక్ష ప్రదేశాలకు తన ప్రత్యక్ష ఉనికిని, సేవా కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  హర్యాణాలోని పానిపట్ పట్టికల్యాణ ఆధారిత సేవా సాధనం గ్రామీణ సేవా సాధన వద్ద ఆదివారం ప్రారంభమైన సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) మూడు రోజుల వార్షిక సమావేశంలో అందుకు అవసరమైన కార్యప్రణాళికను సమీక్షించి, ఖరారు చేయనున్నారు.
 
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్,  సర్ కార్యవాహ దత్తాత్రేయ హొసబలేభారత  మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ఈ సమావేశాలను ప్రారంభించారు. మార్చి 14న ముగియనున్న  ఎబిపిఎస్ సమావేశంలో దేశవ్యాప్తంగా 34 ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత సంస్థలకు చెందిన 1,474 మంది ప్రతినిధిలు పాల్గొంటున్నారు. 
 
ఎబిపిఎస్ ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ సహా సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య 2025 నాటికి సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు.  2020లో కరోనా మహమ్మారి అలుముకున్న తర్వాత సంఘ్ పని,  ప్రభావం బాగా పెరిగిందని చెప్పారు. 2020లో, 38,913 ప్రదేశాలలో 62,491 శాఖలు, 20,303 ప్రదేశాలలో సాప్తహిక్ మిలన్ (వారపు సమావేశాలు), 8,732 ప్రదేశాలలో మాసిక్ మండలి (నెలవారీ సమావేశాలు) జరిగాయి. 2023లో, ఈ సంఖ్యలన్నీ గణనీయమైన పెరుగుదలను చూశాయి.
 
ప్రస్తుతం 42,613 ప్రదేశాల్లో 68,651 శాఖలు, 26,877 చోట్ల సాప్తహిక్ మిలన్, 10,412 చోట్ల మాసిక్ మండలి నిర్వహిస్తున్నారు. సంఘ్ దృక్కోణంలో, దేశంలో 911 జిల్లాలు (జిల్లాలు) ఉన్నాయి, వీటిలో ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగా 901 జిల్లాలలో చురుకుగా పనిచేస్తుంది. అదేవిధంగా, 6,663 ఖండాలలో 88 శాతం,  59,326 మండలాల్లో 26,498 శాఖలను కలిగి ఉంది.
 
సాధారణ ప్రచారక్‌లు, విస్తారక్‌లతో పాటు 1,300 మంది అదనపు శతాబ్ది విస్తారక్‌లు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది సంవత్సరంలో సంస్థ పని, కార్యకలాపాలను విస్తరించడానికి 2 సంవత్సరాల మిషన్‌కు బయలుదేరారు.  భారతదేశ సమాజం అంతా ఒక్కటేనని, అందరూ సమానులే, అందరూ నావారేనని, సమాజానికి నేను ఏదైనా అందించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల నుంచి ఉద్ఘాటించే ఉదాత్తమైన ఆలోచనలు, విలువ వ్యవస్థలని సర్  కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తన ప్రారంభ ప్రసంగంలో ప్రస్తావించారు.
 
స్వయం సేవకులు తమ రోజువారీ పనిలో సమయాన్ని వెచ్చించడం ద్వారా, తమ స్వంత జేబుల నుండి డబ్బు ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ సామాజిక మార్పుకు దోహదపడటం ద్వారా ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలను అంకితభావంతో వ్యాప్తి చేస్తున్నారని గుర్తు చేశారు.
ఆర్ఎస్ఎస్ శాఖలు వ్యక్తిత్వ అభివృద్ధికి కేంద్రాలుగా ఆయన అభివర్ణించారు.
 
శాఖలకు హాజరయ్యే వ్యక్తులు గొప్ప విలువలను అలవర్చుకుంటారని,  తర్వాత జాతీయవాద ఆలోచనలను మేల్కొల్పడం, సమాజాన్ని వెంట తీసుకెళ్లడం ద్వారా సామాజిక పరివర్తనలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఆకర్షణకు పెరుగుతున్నదని చెబుతూ  ఇప్పుడు ఎక్కువ మంది దాని వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు.
 
ఇప్పుడు  ప్రజలు ఆర్ఎస్ఎస్ కోసం అన్వేషిస్తూ డిజిటల్ మాధ్యమం ద్వారా జాతీయవాద సంస్థలో చేరాలని చూస్తున్నారని హొసబలే పేర్కొన్నారు. 2017 నుండి 2022 మధ్య  ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడానికి 7,25,000 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా, ఈ దరఖాస్తుదారులలో ఎక్కువ మంది 20 నుండి 35 సంవత్సరాల వయస్సు గలవారని చెబుతూ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ లో చేరాలని చూస్తున్నారని వివరించారు.
 
ఆర్‌ఎస్‌ఎస్ దైనందిన శాఖలపై కూడా దేశ యువత ఆసక్తిని కనబరుస్తున్నారని చెబుతూ మొత్తం శాఖలలో 60 శాతం విద్యార్థి శాఖలు అని వెల్లడించారు. గత ఒక సంవత్సరంలో, 121,137 మంది యువకులు సంఘ్ ప్రాథమిక శిక్షణను పొందారని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ 109 శిక్షా వర్గ్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెబుతూ, వీటిలో 20,000 మంది స్వయంసేవకులు పాల్గొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
 
సంఘ్ శిక్షణ గురించి  డాక్టర్ వైద్య ప్రస్తావిస్తూ 15-40 సంవత్సరాల మధ్య వయస్సు గల స్వయంసేవకులు ప్రథమ వర్ష శిక్షన్ (మొదటి సంవత్సరం శిక్షణ)లో పాల్గొంటారని, 17-40 సంవత్సరాలలోపు వారు ద్వితీయ వర్ష్‌కు హాజరవుతున్నారని, తృతీయ వర్ష్ అనేది 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఉద్దేశించినదని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ 40 ఏళ్లు పైబడిన స్వయంసేవకుల కోసం ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది.
 
ప్రస్తుతం భగవాన్ మహావీర్  2550వ నిర్వాణ సంవత్సరం, ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ సరస్వతి జన్మించి 200 సంవత్సరాలు, శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి 350 సంవత్సరాలు కావడంతో వీటిని పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ జరుప తలచింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు ప్రతినిధి సభ (ఎబిపిఎస్)లో ఆమోదిస్తారు భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం కొనసాగుతున్న అమృత్ కాల్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక తీర్మానం కూడా ఆమోదిస్తారని డా. వైద్య తెలిపారు.