పర్యాటక రంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళవచ్చు

వినూత్నంగా ఆలోచనలు, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ద్వారా దేశంలో పర్యాటక రంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళవచ్చని  ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. కొత్తగా ఆలోచించి, మరింత మంది పర్యాటకులను ఆకర్షించడం ఎలా అనే విషయంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

‘‘పర్యటన రంగాన్ని మిషన్ మోడ్ లో అభివృద్ధి పరచడం’’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్ లో పర్యాటక రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, అయితే, వాటిని సరిగ్గా వినియోగించుకునే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.

‘‘మన గ్రామాలు సైతం పర్యటన కేంద్రాలుగా మారుతున్నాయి’’ అని ప్రధాన మంత్రి తెలిపారు. మారుమూల పల్లెల లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నందువల్ల పర్యటన చిత్రపటంలోకి ఆ గ్రామాలు కూడా చేరుతున్నాయి” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. సరిహద్దు వెంబడి ఉన్నటువంటి పల్లెల కోసమని కేంద్ర ప్రభుత్వం వైబ్రాంట్ విలేజ్ స్కీమును ప్రారంభించిందని ఆయన చెప్తూ, హోం స్టేస్, చిన్న హోటళ్ళు, రెస్టరాన్ ల వంటి వ్యాపారాలకు మద్దతు అందించవలసిన అవసరం ఎంతైనా సూచించారు.

సరికొత్తగా, దీర్ఘకాలిక వ్యూహంతో ఆలోచించడం వల్ల వచ్చే లాభాల గురించి చెబుతూ వారణాసిలో అభివృద్ధికి ముందు సంవత్సరానికి సుమారు 80 లక్షల మంది భక్తులు వచ్చేవారని, ఇప్పడు వారణాసిని పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దిన తరువాత కనీసం 7 కోట్ల మంది వస్తున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు.

భారత్ లోని పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలతో దేశంలోని అన్ని భాషల్లో యాప్ లను రూపొందించాలని ప్రధాని మోదీ సూచించారు. వాటిలో అత్యాధునిక సాంకేతికతతో ఆయా పర్యాక ప్రదేశాల చిత్రాలు, వీడియోలను పొందుపర్చాలని చెప్పారు. భారతీయులు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉన్నారని, దేశంలో ఇప్పుడు సరికొత్త వర్క్ కల్చర్ ఏర్పడిందని ప్రధాని తెలిపారు.

ఈసంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని ప్రధాని గుర్తు చేశారు. పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ఈ బడ్జెట్ లో పర్యాటక రంగం కోసం కేటాయించిన నిధుల వివరాలను ప్రధాని మోదీ సవివరంగా తెలిపారు. టూరిజం రంగం అభివృద్ధితో యువతకు విశేషంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.

దేశం లో పర్యటన రంగాని కి ఉన్న భారీ అవకాశాల ను ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, కోస్తా తీర ప్రాంతాల్లో పర్యటన, సముద్రం ఒడ్డులలో పర్యటన, మడ అడవులలో పర్యటన, హిమాలయ ప్రాంతాలలో పర్యటన, సాహస యాత్ర ప్రధానమైనటువంటి పర్యటన, వన్యప్రాణి సందర్శన ప్రధానంగా ఉండేటటువంటి పర్యటన, ఇకో-టూరిజమ్, వారసత్వ పర్యటక ప్రదేశాలలో పర్యటించడం, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన, పరిణయ ప్రధానమైన పర్యటక స్థలాల ను సందర్శన, సమావేశాల మాధ్యం ద్వారా పర్యటకానుభూతి ని పొందడం, క్రీడా ప్రధానమైన పర్యటనల వంటి వాటిని గురించి వివరించారు.

రామాయణ్ సర్ కిట్, బుద్ధ సర్ కిట్, కృష్ణ సర్ కిట్, నార్థ్ ఈస్టర్న్ సర్ కిట్, గాంధీ సర్ కిట్ లతో పాటు గురువుల పరంపరలో ఏర్పడిన తీర్థక్షేత్రాలను గురించి సైతం ఆయన ఉదాహరణలుగా పేర్కొంటూ వీటన్నింటి విషయంలో సామూహికంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెటులో స్పర్థాత్మకమైన భావనతోను,  చాలింజ్ రూట్ లోను భారతదేశంలో కొన్ని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి పరచాలని గుర్తించినట్లు చెప్పారు.

 ఒక్క టూరిజం రంగంలోనే కాకుండా, ఏ రంగంలోనైనా మూస పద్దతిలో కాకుండా, సరికొత్తగా ఆలోచించడం వల్ల, దీర్ఘకాలిక వ్యూహాలను కలిగి ఉండడం వల్ల ఊహించని విజయాలు సొంతమవుతాయని ప్రధాని వివరించారు.