
గవర్నర్ తమిళిసై వ్యవహార తీరు బాగోలేదని పేర్కొంటూ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించక పోవటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని వాదిస్తూ గవర్నర్ పరిధి ఏంటీ, ఎందుకు బిల్లులు ఆమోదించటం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ఈ క్రమంలోనే పిటీషన్ దాఖలు చేస్ బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్త్ర ప్రభుత్వం కోరింది. ఈ పిటీషన్ మార్చి 3వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిట్ పిటీషన్ విచారణతో గవర్నర్ పరిధి ఏంటీ అనే విషయంలో స్పష్టత వస్తుందని, బీజేపీ పాలనలో గవర్నర్ల తీరును దేశవ్యాప్తంగా తీసుకెళ్లినట్లు అవుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
ఎన్నికల ముందు రాజకీయ ప్రచారం కోసం సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు పలువురు భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో బిజెపి వర్గాల వాదన మరోలా ఉంది. రాజ్యంగ పరిధిలో బిల్లులు అంటే.. గవర్నర్ ఆమోదిస్తారని, రాజ్యాంగ పరిధికి భిన్నంగా ఉంటే బిల్లులను ఎలా ఆమోదిస్తారని బిజెపి ప్రశ్నిస్తుంది.
అధికారం ఉంది కదా అని చట్ట, న్యాయ, ప్రజా వ్యతిరేక బిల్లులను పంపితే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ ఎలా ఆమోదిస్తారని బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత