సుస్థిర అభివృద్ధికి రైతులతో కలిసి పరిశ్రమ పని చేయాలి

సుస్థిర అభివృద్ధి సాధించడానికి రైతులతో కలిసి పరిశ్రమ పనిచేయాలని కొబ్బరి అభివృద్ధి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి నాదెండ్ల చెప్పారు. వ్యవసాయ దిగుబడులు ఎక్కువ చేసి, వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి సాధించడానికి తక్షణ చర్యలు అమలు జరగాలని ఆమె సూచించారు.

ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ (ఐసీసీ) సహకారంతో కొబ్బరి అభివృద్ధి బోర్డు, వ్యవసాయ, రైతు సంక్షేమ  మంత్రిత్వ శాఖ’ అంతర్జాతీయ కొబ్బరి రంగం-అగ్రస్థానం సాధించడానికి అవకాశాలు’ అనే ఇతివృత్తంతో   కొబ్బరి ఉత్పత్తుల వ్యాపారం, మార్కెటింగ్‌పై హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆమె ప్రారంభించారు. 

ఐసీసీ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కొబ్బరి దిగుబడిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని ఆమె చెపాప్రు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న కొబ్బరిలో 30.93% కొబ్బరి భారతదేశంలో దిగుబడి అవుతుందని, తర్వాత రెండు స్థానాల్లో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఉన్నాయని తెలిపారు. ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

వియత్నాంలో హెక్టారు భూమిలో 10,547 కాయలు ఉత్పత్తి అవుతుండగా, భారత్ లో 9,346 కాయలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని ఆమె చెపాప్రు. .దేశ జీడీపీకి  కొబ్బరి దాదాపు 307956 మిలియన్ రూపాయలు సమకూరుస్తోందని చెబుతూ దాదాపు  కొబ్బరి ఎగుమతుల ద్వారా రూ. 75,768.80 ఆదాయం లభిస్తున్నదని ఆమె వివరించారు.

ప్రాథమిక స్థాయిలో కొబ్బరి ఉత్పత్తిదారుల సొసైటీలతో ( సీపీఎస్‌  ) మూడు అంచెల రైతు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా  రైతులను సంఘటితం చేసేందుకు  కొబ్బరి అభివృద్ధి బోర్డు  ఒక వినూత్న విస్తరణ విధానాన్ని ప్రారంభించిందని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మధ్యంతర స్థాయిలో   కొబ్బరి ఉత్పత్తిదారుల సమాఖ్య(సీపీఎఫ్‌), తదుపరి స్థాయిలో ఉత్పత్తిదారుల సంస్థ( సీపీసీ)  ఏర్పడతాయని ఆమె పెక్రోన్నారు.   ఇప్పటివరకు దేశంలో 9787 సీపీఎస్‌లు, 747 సీపీఎఫ్‌లు, 68 సీపీసీలు ఏర్పాటయ్యాయి. 

 కొబ్బరిలో ప్రపంచ మార్కెట్ అవకాశాలు, కొబ్బరి రంగంలో వినూత్న పరిశ్రమ,  కొబ్బరి రంగంలో సుస్థిరతపై సాంకేతిక సమాచారాన్ని బదిలీ జరగాలని  ఐసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జెల్ఫినా సి. అలోవ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో  వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపిన డాక్టర్  రఘునందన్ రావు రాష్ట్రంలో కొబ్బరి దిగుబడి పెరిగిందని చెప్పారు. పంటలతో పాటు కాయల ఉత్పత్తికి రాష్ట్రం ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.