టర్కీ భూకంపంలో 1.5 కోట్ల మంది నిరాశ్రయులు

టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాల వల్ల లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ తీవ్ర భూకంపాల వల్ల టర్కీలో కోటి యాభై లక్షల మంంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రకృతి ప్రకోపానికి ఇళ్లు కోల్పోయిన వారికి.. తిరిగి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆ దేశ ప్రధాని ఎర్డోగాన్‌ ప్రకటించారు.

 తాజా లెక్కల ప్రకారం భూకంపంలో మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. టర్కీలో 44,218 మంది మృతి చెందగా, సిరియాలో 5,914 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే టర్కీలో ఈ ఏడాది జూన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎర్డోగన్‌ ప్రభుత్వం ఎన్నికల లక్ష్యంగా గృహాల పునర్నిర్మాణాల ప్రక్రియ వేగవంతం చేస్తోంది.

భూకంపాల వల్ల నష్టపోయిన 15 లక్షల ప్రజల కోసం కొత్త గృహాల నిర్మాణ పనులు ప్రారంభించిన శనివారమే టర్కీని మరోసారి భూకంపం వణికించింది. సెంట్రల్‌ టర్కిష్‌ ప్రావిన్స్‌ నిగ్డేలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు టర్కీ ప్రభుత్వం తెలిపింది ఈ నిర్మాణ ప్రణాళికలకు వరసగా వస్తున్న భూకంపాలు, భూప్రకంపనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 6న భారీ భూకంపాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వెయ్యికిపైగా ప్రకంపనలు టర్కీలో చోటు చేసుకున్నాయి. ఈ విపత్తులో అన్నీ కోల్పోయిన ప్రజలు ప్రస్తుతం గుడారాల్లో కాలం వెల్లదీస్తున్నారు.

అయితే ఓటు బ్యాంకింగ్‌ కోసమే ఇళ్లను వేగంగా నిర్మించకుండా.. భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ‘ఇప్పటికే అనేక ప్రాజెక్టుల కోసం టెండర్లు, కాంట్రాక్టులు జరిగాయి. వాటి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. నిర్మాణాల భద్రతపై ఎటువంటి రాజీ ఉండబోదని.. భద్రతతోనే నిర్మాణాలు జరుగుతాయని’ ఓ అధికారి భరోసా ఇచ్చారు.

కాగా, ఇప్పటికే నిర్మాణ భద్రతల్ని పాటించడం లేదని ఎర్డోగాన్‌ ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. అక్కడ నేలకూలిన గృహాల పునర్నిర్మాణాలకు భారీగా ఖర్చవుతోంది. 2 లక్షల అపార్ట్‌మెంట్స్‌, 70 వేల గ్రామాల్లో నివశించే ఇల్లు మాదిరిగా గృహలను పునర్నిర్మించాలంటే కనీసం 15 బిలియన్‌ డాలర్ల ఖర్చవతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఇక అమెరికా బ్యాంక్‌ జె.పి మోర్గాన్‌ గృహా నిర్మాణాలకు, మౌలిక సదుపాయాలకు 25 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, తక్షణమే 5 లక్షల ఇళ్లు అవసరమని ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) అభిప్రాయపడింది.

టర్కీలో 1999లో సంభవించిన భూకంపం తర్వాత అక్కడ నిర్మాణాలకు 13 మిలియన్‌ టన్నులు అవసరమయ్యాయని. 2023 ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపానికి దాదాపు 116-210 మిలియన్‌ టన్నుల రాళ్లు అవసరమవుతాయని యున్‌డిపి అంచనా వేసింది. ఈ భూకంపంతో నిరాశ్రయులైన వారి కోసం అధికారులు టెంట్లు పంపుతున్నారు. అయితే అధికారులు సరిపడినన్ని టెంట్లు పంపకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హస్సా పట్టణంలోని ఉన్నత పాఠశాల వెలుపల టెంట్ల కోసం ప్రజలు క్యూ కట్టారని మీడియా పేర్కొంది.