చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్ అలీమ్ ఖాన్, ఫార్మేషన్ నిర్మాణం, కార్యకలాపాలు, గార్డు డ్యూటీల జాబితా, ఆర్మీ వాహనాల సమాచారం, వాటి కదలికల గురించిన వివరాలు పాకిస్థాన్‌కు చేరవేశాడు. అలాగే చైనా సరిహద్దును పర్యవేక్షిస్తున్న ఉపగ్రహాలు, నిఘా రాడార్, ఇతర పరికరాల స్థానాల సమాచారాన్ని కూడా పొందేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు నిఘా వర్గాల ద్వారా ఈ విషయం తెలియడంతో జవాన్ అలీమ్ ఖాన్‌ను ఆర్మీ అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌కు చేరవేసిన సమాచారంపై అతడ్ని ప్రశ్నించి విచారణ జరిపేందుకు కోర్ట్‌మార్షల్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
ఈశాన్య ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఆ సరిహద్దులోని ఆర్మీ కార్యకలాపాల గురించి శత్రు దేశమైన పాకిస్థాన్‌కు చేరవేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి