ఢిల్లీ టెస్ట్ లో భార‌త్ ఘ‌న విజ‌యం

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 115 పరుగుల టార్గెట్ ను టీమిండియా అవలీలగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది టీమిండియా.
 
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ (01), రోహిత్ శర్మ(31), విరాట్ కోహ్లీ(20), శ్రేయస్ అయ్యర్(12), పుజారా(31)నాటౌట్, శ్రీకర్ భరత్(23) నాటౌట్ పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయాన్ రెండు వికెట్లు, మర్ఫీ ఒక వికెట్ తీశాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీయడంతో పాటు 26 పరుగులు చేసిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దిక్కింది.
 
మ‌రోసారి స్పిన్ ద్వ‌యం ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ టీమ్ ఇండియా విజ‌యంలో కీల‌క భూమిక పోషించారు. వారిద్ద‌రి బౌలింగ్ మెరుపుల‌తో మూడు రోజుల్లోనే సెకండ్ టెస్ట్ మ్యాచ్ ముగిసింది. జ‌డేజా ఏడు వికెట్ల‌తో మెర‌వ‌డంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవ‌లం 113 ప‌రుగుల‌కే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఒక ప‌రుగు ఆధిక్యంతో క‌లుపుకొని టీమ్ ఇండియా ముందు 115 ప‌రుగుల టార్గెట్‌ను విధించింది.
 
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 ప‌రుగులు చేయ‌గా ఇండియా 262 ర‌న్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో జ‌డేజా తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు మొత్తంగా ప‌ది వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండు ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు ద‌క్కాయి. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది  వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో భారత్ జట్టు టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.