సుస్థిర అభివృద్ధి సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక పాత్ర

వేగవంతం చేసి విపత్కర పరిస్థితులు, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్ళను అధిగమించి సుస్థిర అభివృద్ధి సాధించడానికి శాస్త్ర  సాంకేతిక రంగం  కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనికోసం శాస్త్ర, సాంకేతిక రంగాల సుపరిపాలన అవసరం ఉంటుందని చెప్పారు.

శాస్త్రవేత్తల కోసం రూపొందించిన శిక్షణా కార్యక్రమాలను  హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో  ప్రారంభించి,  ఐజీఓటీ ప్లాట్ ఫామ్ ద్వారా గవర్నెన్స్ కోర్సు మాడ్యూల్ ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల నుంచి పూర్తి ప్రయోజనం పొందడం అతి పెద్ద సవాల్ గా మారిందని చెబుతూ అయితే అందుకు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎటువంటి అవరోధాలు లేవని,  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం  పాలనలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

ప్రసిద్ధ ‘కొలింగ్రిడ్జ్ డైలమా’ లా  శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం నిర్వహణ  మారిందని చెబుతూఆవిష్కరణ ప్రక్రియ ప్రారంభం అయిన సమయంలో జోక్యం చేసుకోవడం, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం సులువైన అంశాలుగా కనిపిస్తాయని తెలిపారు. అయితే, సాంకేతికత  పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత సులభంగా మార్పు చేయడం కష్టమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  

 సామ్యవాద దేశం అయిన  భారతదేశంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్రజల  జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించి సమాజానికి ప్రయోజనం కలిగించే విధంగా శాస్త్రీయ  అభివృద్ధి సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు.

శాస్త్రీయ పరిశోధన , అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని స్పష్టం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్   ప్రైవేటు రంగం కూడా భారతీయ పరిశోధన  అభివృద్ధి రంగాల్లో పాల్గోవాలని కోరారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేసి పరస్పర ప్రయోజనం పొందవచ్చునని చెబుతూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో  శాస్త్రవేత్తలు  కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు.

 ప్రారంభ పరిశోధన దశ నుంచి వ్యాపార ఆవిష్కరణల వరకు అన్ని దశల్లో ప్రైవేట్ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రైవేటు రంగం పాత్ర పెరిగేలా చూడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారం  ఇస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.  ఇంక్యుబేటర్లు, సాఫ్ట్ వేర్ పార్కులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం రీసెర్చ్ గ్రాంట్లు, ఇన్నోవేషన్ గ్రాంట్లు లేదా నాన్ ఫైనాన్షియల్ రూపంలో కేంద్రం సహకారం అందిస్తామని మంత్రి వివరించారు. క్లిష్టమైన అంశాలను  సమర్థవంతంగా నిర్వహించడంలో సైన్స్ నిర్వాహకులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన చెప్పారు.

శాస్త్రవేత్తల  కోసం ఆస్కీ, సీబీసీలు ఈ కోర్సును ప్రత్యేకంగా రూపొందించాయి.  ప్రైవేటు రంగంతో భాగస్వామం కుదుర్చుకోవడానికి అవసరమైన  సృజనాత్మకత, సమర్థవంతమైన నాయకత్వం అంశాల్లో   సీనియర్ శాస్త్రవేత్తలకు శిక్షణ అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.  పోటీ వాతావరణంలో శాస్త్రీయ సంస్థలు మరింత సమర్థవంతంగా పని చేయడానికి వీలు కల్పించే విధంగా సీనియర్ శాస్త్రవేత్తలకు  సృజనాత్మక ఆలోచన నైపుణ్యాలు, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని   సామర్థ్యాలకు మరింత పదును పెట్టే విధంగా  శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.