న్యూజిలాండ్‌లో అటు తుఫాన్ … ఇప్పుడు భూకంపం

గత కొన్ని రోజులుగా గాబ్రియెల్‌ తుఫానుతో న్యూజిలాండ్‌ గజగజ వణుకుతుండగా ఇప్పుడు భూకంపం వచ్చి పడింది. బుధవారం వెల్లింగ్‌టన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. పరాపరౌముకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
 
 అయితే ఈ భూకంపం వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిందనే విషయాలపై స్పష్టత లేదు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని అధికారులు తెలిపారు. మరోవైపు న్యూజిలాండ్‌ను గత కొన్నిరోజులుగా గాబ్రియెల్ తుఫాను వణికిస్తోంది. నార్త్‌ ఐలాండ్‌, ఆక్లాండ్‌లో గాబ్రియెల్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వేలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉధృతికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
 
భారీ వర్షాలకు తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో 10,500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
 
వరద ఉధృతికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో న్యూజిలాండ్ చరిత్ర లోనే మంగళవారం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొన్ని వారాల క్రితమే ఆక్లాండ్, ఉత్తర ఐలాండ్ ప్రాంతాలను భారీ తుపాను తాకింది. గత నెలలో ఆక్లాండ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భారీగా వరదలు వచ్చాయి.
 
మరోవైపు, గత వారం సంభవించిన భూకంపాలతో టర్కీ, సిరియా అపారంగా నష్టపోయాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్ల డించాయి. అయితే ఈ భూ ప్రళయంలో దాదాపు 72వేల మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ సంస్థలు నివేదిస్తున్నాయి. ఏడు లక్షల కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లిన ట్లు అంచనాలు వెల్లడవుతున్నాయి. టర్కీలో ఇప్పటికీ వేలాది మంది శిథిలాల కిందే ఉన్నట్టు తెలుస్తోంది.