మరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ

బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి రెపో రేటు పెంచింది. ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష జరిగింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ రెపో రేట‌ను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఆయ‌న తెలిపారు. రెపో రేటు పెంపుతో మ‌ళ్లీ పెర‌గ‌నున్న వ‌డ్డీ రేట్లు పెర‌గ‌నున్నాయి.
 
దీంతో లోన్ ఈఎంఐలు పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా అంచ‌నా వేస్తున్నారు. ఆర్బీఐ రెపో రేటును పెంచ‌డం ఇది వ‌రుస‌గా ఆరోసారి. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్న‌ట్లు శ‌క్తికాంత్ దాస్ చెప్పారు. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరుకున్న‌ది.  ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రకటించారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించారు. 
గత ఏడాది మే నుంచి ఆర్బీఐ విడతల తారీగా 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును పెంచింది.  అంటే 2.5 శాతం వడ్డీ రేటు అధికమై ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు శక్తికాంత దాస్ వెల్లడించారు.
 
కొన్ని నెల‌ల క్రితం ఉన్న ప్ర‌పంచ ఆర్ధిక స్థితి ఇప్పుడు లేద‌ని, చాలా వ‌ర‌కు పెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల్లో ప్ర‌గ‌తి క‌నిపిస్తోంద‌ని, కానీ ద్ర‌వ్యోల్బ‌ణం స్వ‌ల్ప స్థాయిలో ఉన్న‌ట్లు దాస్ వెల్ల‌డించారు. 2023-24లో నాలుగ‌వ క్వార్ట‌ర్‌లో ద్ర‌వ్యోల్బ‌ణం స‌గ‌టున 5.6 శాతం ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు దాస్ చెప్పారు. ఈ ఏడాది వాస్త‌వ జీడీపీ 6.4 శాతంగా ఉంటుద‌ని ఆయ‌న పేర్కొన్నారు.