కివీస్ 41 ఓవర్లకే ఆల్ అవుట్, భారత్ ఘన విజయం

న్యూజీలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో  41 ఓవర్లలోనే కివీస్ ఆల్ అవుట్ కావడంతో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్పై ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్లో పైచేయి సాధించిన టీమిండియా ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్లోనూ అదే జోరు కనబరుస్తోంది.
 
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ జట్టును టాప్ క్లాస్ ఆటతీరుతో ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, పించ్ హిట్టర్ శుబ్మన్ గిల్ చెరో సెంచరీ బాదారు. వీరిద్దరి భాగస్వామ్యం సూపర్గా కొనసాగింది. రోహిత్ సెంచరీ చేసిన తర్వాత (101) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హిట్ కొట్టబోయి వికెట్లు పడేసుకుంటాడు. ఇట్లా 212 పరుగుల వద్ద రోహిత్ హిట్ వికెట్గా పెవిలియన్ చేరడంతో.. క్రీజ్లోకి కింగ్ కోహ్లీ వచ్చాడు.ఆ తర్వాత గిల్ (112) పరుగుల వద్ద రెండో వికెట్గా దొరికిపోతాడు. కోహ్లీ (36), ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ యాదవ్ (14), హార్దిక్ పాండ్యా (54), వాషింగ్టన్ సుందర్ (9), శార్దూల్ ఠాకూర్ (25), కుల్దీప్ యాదవ్ (3) ఆడి తొమ్మిదో వికెట్గా వెనుతిరుగుతాడు. ఉమ్రాన్ మాలిక్ 2 పరుగులతో నాటౌట్గా నిలుస్తాడు. దీంతో టీమిండియా మొత్తం 385 పరుగుల భారీ స్కోరు చేసి కివీస్ ముందు 386 రన్స్తో అతి పెద్ద టార్గెట్ పెట్టింది.

ఇక సెకండ్ ఇన్సింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన కివీస్ ని టీమిండియా బౌలర్లు ఊచకోత కోశారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు ఫిన్ అలెన్ (0) డకౌట్గా దొరికిపోయాడు. ఆ తర్వాత డేవాన్ కాన్వే (138), హెన్రీ నికోలస్(42) కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు.

ఆటను వారి చేతుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కుల్దీప్ యాదవ్ వేసిన ఓ బంతి నికోలస్ కాళ్లకు తగలడంతో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాల్సి వస్తుంది.. ఇట్లా వీరి సక్సెస్ జోడీకి బ్రేక్ పడ్డట్టు అయ్యింది. ఆ తర్వాత శార్ధూల్ ఠాకూర్ మూడు వికెట్ సాధించాడు. మిచ్చెల్ (24), టామ్ లాథమ్ (0)ని వరుసగా దెబ్బతీసిన శార్దూల్.. అత‌ని బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (5) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దాంతో కివీస్ సగం వికెట్లు కోల్పోయింది.

ఇంకా అప్పటికీ శ‌త‌క వీరుడు కాన్వే, బ్రేస్‌వెల్ క్రీజులో ఉండి మరో అంతిమపోరాటం చేసేందుకు యత్నించారు. అంత‌కుముందు ఓవ‌ర్‌లో లాథ‌మ్, మిచెల్‌ను ఔట్ చేసిన శార్దూళ్ కివీస్‌ను దెబ్బమీద దెబ్బకొట్టాడు. 36 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆ జ‌ట్టు 7 విక‌ట్ల న‌ష్టానికి 269పరుగులు చేసింది. కివీస్ విజ‌యానికి ఇంకా 82 బంతుల్లో 117 ర‌న్స్ కావాలి.

ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-1

ఇలా ఉండగా,  ఒడిI ర్యాంక్స్లో ఇప్పటిదాకా మూడవ స్థానంలో ఉన్న టీమిండియా రేటింగ్ పాయింట్లలో మొదటి రెండు జట్లు – ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లతో సమంగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడటంతో భారత్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది.

న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లలో క్లీన్ స్వీప్ చేయడంతో భారత జట్టు తమను తాము ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్-బాల్ జట్టుగా నిరూపించుకుంటోంది.కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమ్ గిల్ సెంచరీల చెలరేగి ఆడడంతో సిరీస్‌లోని చివరి వన్డేలో భారత్ 385 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

ఒడిIలలో రోహత్ శర్మ రెండేళ్ల తర్వాత సెంచురీ చేశారు. జనవరి 2020 నుండి ఇప్పటివరకు సెంచరీ చేయలేదు. వైట్ బాల్ ఫార్మాట్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, టెస్టుల్లో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు కోసం భారత్ 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది.