ఢిల్లీలో ఒక్కసారిగా పడిపోయిన వాయు నాణ్యత

ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు (ఏక్యూఐ) ఒక్కసారిగా, ఊహించని విధంగా శనివారం రాత్రి నుంచి పడిపోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఆదివారం ఢిల్లీలో ఏక్యూఐ 407 గా నమోదయిందని నాలుగు గంటలకు విడుదల చేసిన  బులిటెన్ లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. శనివారంన నమోదైన ఏక్యూఐ(294) తో పోల్చి చూస్తే ఇది 113 పాయింట్లు అధికంగా ఉంది.

సరాసరి ఏక్యూఐ పెరుగుదల చూపించడంతో దేశ రాజధాని దాని పరిసర ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ అంశంపై గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌పి) కింద చర్యలను ఏర్పాటైన కమిషన్ (సిఎక్యూఎం) అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది.  24 గంటల్లో రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో ప్రమాణాలు  అనూహ్యంగా, గణనీయంగా క్షీణించడంతో ఏక్యూఐ పెరిగిందని గుర్తించారు.

అయితే, ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని సమావేశం గుర్తించింది. రాత్రికే ఏక్యూఐ “తీవ్ర స్థాయి” నుంచి ”  అతి తక్కువ స్థాయి” కి చేరుకునే అవకాశం ఉంది. ఐఎండీ/ ఐఐటీఎం అందించిన నివేదికల ప్రకారం ఢిల్లీలో వాయు నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. ఏక్యూఐ ఇప్పటికే తగ్గుదల నమోదు అవుతోంది. ఏక్యూఐ స్థాయి “తక్కువ” నుంచి “అతి తక్కువ” స్థాయి మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. 

పరిస్థితిని సమీక్షించిన కమిటీ కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత కోసం అమలు చేస్తున్న స్థాయి-I, స్థాయి-II కింద అమలు చేస్తున్న చర్యలు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితిలో స్థాయి-III కింది చర్యలు అవసరం లేదని సమావేశం అభిప్రాయపడింది.

ఈ సమయంలో కాలుష్య నియంత్రణ కోసం  జిఆర్‌పి కింద చర్యలు అమలు చేసేందుకు ఏర్పాటైన వివిధ సంస్థలతో సహా దేశ రాజధాని, డిపిసీసీ  కాలుష్య నియంత్రణ బోర్డులు   గాలి క్షీణతను నివారించడానికి మొత్తం రాజధాని ప్రాంతంలో స్థాయి -I, స్థాయి -II కింద కాలుష్య నియంత్రణ , ఉపశమన చర్యలు అమలు చేయాలని సమావేశం ఆదేశాలు జారీ చేసింది.

పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న సబ్ కమిటీ, పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకుంది. తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమిటీ తీసుకున్న నిర్ణయాలు caqm.nic.in లో అందుబాటులో ఉన్నాయి.