ఇక నుంచితెలుగులోనూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు

ఇక నుంచి తెలుగు భాషల్లోనూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) పరీక్షలు నిర్వహించునున్నారు. హిందీ, ఇంగ్లీషుతోపాటు మరో 13 భాషల్లోనూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహించునున్నారు. దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)లను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మల్టీ-టా స్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్ – 2022 ను ప్రాంతీయ భాషలతోపాటు మొత్తం 15 భాషల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది.హిందీ, ఇంగ్లీష్ తో పాటు తెలుగు, ఉర్దూ, తమిళం, మలయాళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపూరి(మైతి), మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.

ఎమ్‌ఎఎస్ పరీక్షను ఇలా ప్రాంతీయ భాషల్లో చేపట్టడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇక నుంచి మొత్తం 15 భాషల్లోనూ వీటిని నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థల్లో అతిపెద్దదిగా ఉన్న స్టాఫ్ సెలక్షన్ క మిషన్ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని గ్రూప్-బీ (నాన్- గెజిటెడ్), గ్రూప్-సీ (నాన్-టెక్నికల్) విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది.

పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని గతంలో కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు 2020 నవంబర్‌ 18న ప్రధాని నరేంద్ర మోదీకి  లేఖ రాశారు. ఇప్పుడు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది.
 
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వారి వారి రాష్ట్రాల్లో జరిగే గ్రూప్‌ 1, 2, 3, ఎస్సై, కానిస్టేబుల్‌ తదితర పోటీ పరీక్షల కోసం అయ్యే ప్రిపరేషన్‌ కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇప్పటివరకు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు 10 శాతానికి మించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారనే విమర్శలు చెలరేగాయి.
 
ఉద్యోగ నియామకాల్లో భాష అవరోధంతో ఏ ఒక్కరూ అవకాశం కోల్పోవద్దనేదే తమ ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విషయంపై వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోకాలంగా అభ్యర్ధనలు వస్తున్నాయని, ముఖ్యంగా దక్షిణాది రా ష్ట్రాల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయని తెలిపింది.