రహబార్ ఫౌండేషన్: ‘సేవ’ వెనుక ఆర్ధిక అక్రమాలు!

రహబార్ ఫౌండేషన్: ‘సేవ’ వెనుక ఆర్ధిక అక్రమాలు!
మీకు కూరగాయలో, పండ్లు కొనడానికి దగ్గరలోని సంతకు వెళ్ళినప్పుడో, మరేదైనా పని మీద బయటకు వచ్చినప్పుడో మీకు కనిపించే తోపుడు బండ్లపై Donated by Rahbar Foundation అని రాసి ఉండటం గమనించే ఉంటారు. హైదరాబాద్, చుట్టుప్రక్కల నివసించేవారికి ఇది దాదాపు నిత్యం కనిపిస్తూనే ఉంటుంది.
వాటిపై కూరగాయలో, పండ్లో, పూవులో అమ్మేవారంతా దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిలా ఉండటం గమనించవచ్చు. తమ సామాజిక వర్గంలోని పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేసి వారిని ఆర్ధికంగా ఆదుకోవడం మంచి పనే. కానీ ఆ సేవ వెనుక ఉన్న ఆర్ధిక అవకతవకల గురించి ఒకసారి గమనిద్దాం. ముందుగా ఈ Rahbar Foundation ఏమిటో గమనిద్దాం.
Rahbar Foundation అనేది అమెరికాలో ఏర్పాటై, అక్కడ ప్రభుత్వం నుండి పన్ను మినహాయింపు పొందిన సెక్షన్ 501 (C)(3) ఛారిటీ సంస్థ. టెక్సాస్ రాష్ట్రంలో గల డల్లాస్ నగరంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. పేరుకు ఛారిటీ సంస్థ అయినప్పటికీ ఇందులో కీలక సభ్యులందరూ ఒకే మతానికి చెందిన వారు. సేవ చేసేది కూడా ప్రధానంగా ముస్లిం మతస్థులకే అని ఆ సంస్థ వెబ్సైట్ చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. పేద ముస్లిములకు తోపుడు బండ్లు, దుప్పట్లు, నిత్యావసరాలు పంపిణీ చేయడం, ముస్లిం విద్యార్థులకు కంప్యూటర్, ఇతర వృత్తినైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులు, ఇతర ఇస్లామిక్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఈ రహబార్ ఫౌండేషన్ కార్యక్రమాలు.
కేవలం తమ సామాజిక వర్గానికి చెందిన పేదలకు సేవ చేయడం తప్పేమీ కాదు. ఎవరికి వారు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణలోని ఇతర పట్టణాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రహబార్ ఫౌండేషన్ చేపట్టిన భారీ కార్యక్రమాల వెనుక ఆర్థికపరమైన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Rahbar Foundation తమ అధికారిక వెబ్సైట్ rahabarfoundation.orgలో అప్లోడ్ చేసిన 2017 నుండి 2021 సంవత్సరాలకు చెందిన వార్షిక ఖర్చుల నివేదిక.. అంటే Annual Financial Statementsలో భారతదేశంలోని ఏయే సంస్థలకు ఎంత నిధులు ఇచ్చిందీ స్పష్టంగా చెప్పుకొచ్చింది.
విదేశీ సంస్థలు భారతదేశంలో ఉన్న సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు చేయవచ్చు.. ఇక్కడి సంస్థలకు విరాళాలు కూడా ఇవ్వవచ్చు. కానీ అందుకు కేంద్ర హోంశాఖ నుండి Foreign Contribution Regulation Act క్రింద FCRA License పొందటం తప్పనిసరి అని చట్టం చెప్తోంది.
Rahbar Foundation ప్రతి ఏటా విరాళాలు ఇస్తున్నట్టుగా చెప్తున్న భారతదేశ సంస్థలన్నీ ఇస్లామిక్ సంస్థలే.  అంటే ఇస్లామిక్ మతపరమైన ఆశయాలతో, ముస్లిములే తమ సేవలకు మొదటి హక్కుదారులుగా నడుస్తున్న సంస్థలన్నమాట. అది కూడా తప్పేం కాదు. కానీ ఆ సంస్థలకు విదేశీ విరాళాలు పొందేందుకు కేంద్ర హోంశాఖ నుండి Foreign Contribution Regulation Act క్రింద FCRA లైసెన్సులు ఉన్నాయా అనేది ప్రశ్న.
రెండు కీలక అంశాలను ఆధారంగా చేసుకుని Nijam Today ఈ వ్యవహారంపై ఒక పరిశోధన నిర్వహించింది. ఒకటి కేంద్ర ప్రణాళికా సంఘంగా భావించే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని ‘దర్పణ్’ డేటాబేస్, మరొకటి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్న FCRA రిజిస్టర్డ్ సంస్థల డేటాబేస్.
విదేశీ విరాళాలు పొందుతున్న సంస్థలన్నీ తమ వివరాలు నీతీ ఆయోగ్ నిర్వహిస్తున్న ‘దర్పణ్’ వెబ్సైటులో రిజిస్టర్ చేసుకోవడం అని కేంద్ర హోంశాఖ 2017లో నోటీస్ జారీ చేసింది. ఇకపోతే FCRA లైసెన్స్ ఉన్న సంస్థల వివరాలన్నీ కూడా కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న డాటాబేసులో తప్పనిసరిగా ఉంటాయి.
ప్రకారం Rahbar Foundation సంస్థ భారతదేశంలో విరాళాలు ఇస్తున్నట్టుగా చెప్తున్న 21 సంస్థలలో కేవలం మూడు సంస్థల వివరాలు మాత్రమే ఆ పైన చెప్పిన రెండు డేటాబేస్ లో ఉన్నాయి. మిగిలిన సంస్థల వివరాలు లేవు.  
ఇంతకీ రహబార్ ఫౌండేషన్ నుండి దేశీయ సంస్థలకు వస్తున్న విరాళాలు ఎంతో తెలుసా? గత ఐదేళ్ళలో భారతదేశంలోని ఇస్లామిక్ సంస్థలకు రహబార్ ఫౌండేషన్ నుండి అందిన విరాళాలు 30 లక్షల అమెరికన్ డాలర్లకు పైమాటే. దాన్ని భారతదేశ కరెన్సీలోకి మార్చి చుస్తే ఎంతవుతుందో మీరే అంచనా వేయండి. 
భారతదేశంలో ఇస్లామిక్ అనుకూల కార్యక్రమాలే ప్రధాన ఉద్దేశంగా నిధులు సరఫరా చేస్తున్న రహబర్ ఫౌండేషన్, అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన తమ Annual Financial Returns అంటే Form-990లో మాత్రం ఎక్కడా ‘ఇస్లామిక్’ అనే పదం లేకుండా జాగ్రత్తపడింది. అంతేకాదు Form-990 భారతదేశం పేరును ఎక్కడా ప్రస్తావించకుండా ‘South Asia’ అని మాత్రమే పేర్కొంది.
Rahbar Foundation ఇక్కడ పేదలకు, అంటే పేద ముస్లిములకు మైక్రో-ఫైనాన్స్ కింద అప్పుల రూపంలో కూడా ఆర్ధిక సహాయం చేస్తోంది. అందులో భాగంగా తమ ‘సేవాకార్యక్రమాల్లో భాగస్వామ్యం’ పేరిట అమెరికాలోని టాప్ గ్లోబల్ కంపెనీల నుండి నిధులు వసూలు చేస్తోంది.
Rahabar Foundation నుండి భారీ ఎత్తున డబ్బును స్వీకరిస్తున్న దేశీ సంస్థల ప్రధాన ఉద్దేశం కేవలం సేవే అయితే అయితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ భారతదేశ చట్టాలను అనుసరించడంలో వచ్చిన ఇబ్బంది ఏమిటనేది ప్రశ్న.
దేశీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇక్కడి సంస్థలు FCRA లైసెన్స్ లేకుండా విదేశీ విరాళాలు ఎలా స్వీకరిస్తాయి? ఆ విరాళాలు మరే ఇతర అక్రమ కార్యకలాపాలకు ఉపయోగపడట్లేదన్న గ్యారంటీ ఏమిటి? భారత ప్రభుత్వ భద్రతా సంస్థలు దీనిపై దృష్టి సారించి విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి.