బీఆర్ఎస్ తొలి సభ ‘‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను యాదాద్రి తీసుకెళ్లారని విమర్శించారు. కేసీఆర్ నోట ఏ దేశం పేరొస్తే… ఆ దేశం పని ఔట్ అయిపోతోందని అంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలే ఇందుకు ఉదాహరణ అని గుర్తు చేశారు.
దయచేసి భారత్ బాగుందనే పదం కేసీఆర్ నోట రానివ్వొద్దని కోరారు. క్రిష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను వాడుకోలేని కేసీఆర్ దేశ జల విధానం గురించి మాట్లాడటం సిగ్గుచేటనని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రాజెక్టుల కట్టి సాగునీరందిస్ తెలంగాణలో వ్యవసాయ బోర్ల సంఖ్య ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ సరఫరా చేయడం లేదని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు.
అగ్నిపథ్ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలను కూడా సక్రమంగా భర్తీ చేతగాకపోవడంతో లక్షల మంది నష్టపోతున్నారని చేతనైతే వాళ్లకు సాయం చేయాలని సూచించారు. తుపాకీరాముడి మాదిరిగా టోపీ పెట్టుకున్న కేసీఆర్ మేక్ ఇన్ ఇండియాను విమర్శించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు చోటివ్వని కేసీఆర్ మహిళలకు 35 శాతం రిజర్వేషన్ల ఇస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ‘జై తెలంగాణ’ అనే పదాన్ని విస్మరించిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. మతతత్వం గురించి మాట్లాడుతున్న నేతలు హిందూ దేవుళ్లను, మతాన్ని కించపరిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని, అది మతతత్వం కాదా? అని ప్రశ్నించారు. మోదీని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే బీఆర్ఎస్ సభ పెట్టారే తప్ప తెలంగాణలో చేసిన అభివ్రుద్ధి ఏమీ లేదని దయ్యబట్టారు.
ఖమ్మం సభకు వచ్చినోళ్లు ఒక్కరు కూడా బీఆర్ఎస్ పేరును ఉచ్చరించలేదని గుర్తు చేశారు. “కేజ్రీవాల్ ఈసారి దేశంలో అధికారంలోకి వచ్చేది ఆప్ అంటడు… సభకు వచ్చినోళ్లు స్కాంలో ఇరుక్కుపోయారు. ఒకరు గోల్డ్ స్కాంలో, లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోయారు. పంజాబ్ సీఎం, తెలంగాణ సీఎంలు తాగి ఊగడంలో దోస్తులు (జాన్ జబ్బలు)” అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు.
More Stories
తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం
వర్గీకరణకు కమిషన్ పేరుతో ఉద్యోగ భర్తీకి ఎగనామం!
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్