భగవద్గీతపై ప్రమాణం చేసిన మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌

అమెరికాలోని మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్‌-అమెరికన్‌గా అరుణా మిల్లర్‌ అమెరికాలో చరిత్ర సృష్టించారు.

 

అరుణా మిల్లర్‌ మేరీల్యాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్. ఆమె 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో కూడా పనిచేశారు. అక్కడ రెండు పదవీకాలాన్ని పూర్తి చేశారు. భారతీయ-అమెరికన్లలో అరుణకు మంచి పేరున్నది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికలో చాలా మంది ట్రంప్ మద్దతుదారులు ఆమెకు మద్దతు ఇచ్చారు.

 కాగా, మేరీల్యాండ్‌లో నల్లజాతీయులు మూడు ఉన్నత స్థానాలకు ఎన్నికయ్యారు. వెస్ మూర్ గవర్నర్‌గా.. అరుణ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, ఆంథోనీ బ్రౌన్ లెఫ్టినెంట్ జనరల్‌గా ఎన్నికయ్యారు.

హైదరాబాద్‌లో జన్మించిన 58 ఏండ్ల అరుణ 1972 లో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లింది. 2000 సంవత్సరంలో అమెకు అమెరికా పౌరసత్వం లభించింది. అరుణ వృత్తి రీత్యా కెరియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్. మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 సంవత్సరాలు పనిచేశారు. అరుణ తండ్రి కూడా మెకానికల్ ఇంజనీర్. 1972లో అరుణకు ఏడేండ్ల వయసులో భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని అమెరికా వెళ్లాడు.