జోషిమఠ్ పట్టణం మొత్తం మునిగిపోయే అవకాశం… ఇస్రో

పవిత్ర పట్టణమైన జోషిమఠ్  మొత్తం మునిగిపోయే అవకాశం ఉందని భూమి క్షీణతపై  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.జోషిమఠ్ పట్టణ శాటిలైట్ చిత్రాలు కార్టోశాట్-2ఎస్ ఉపగ్రహం నుంచి ఇస్రో తీసుకొని పరిశీలించింది. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ జోషిమఠ్ పట్టణంలో మునిగిపోనున్న ప్రాంతాల ఉపగ్రహ చిత్రాలను తాజాగా విడుదల చేసింది. ఈ శాటిలైట్ చిత్రాల్లో ఆర్మీ హెలిప్యాడ్, నరసింహ ఆలయంతో సహా మొత్తం పట్టణం సెన్సిటివ్ జోన్‌గా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇస్రో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రమాదకర ప్రాంతాలైన జోషిమఠ్ లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. జోషిమఠ్ ప్రాంతాల్లోని ప్రజలను ప్రాధాన్యమిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గత ఏడాది నవంబర్, డిసెంబరు నెలల్లో జోషిమఠ్ పట్టణ భూమి క్షీణించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

 కాగా,  ఇక్కడ కేవలం 12 రోజుల్లోనే 5.4 సెం.మీ నేల కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా షేర్ చేసింది. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిలీజ్ చేసిన ఈ చిత్రాలు డిసెంబర్ 27 నుంచి జనవరి 8 మధ్య రోజులకు చెందినవిగా తెలిపింది.

అయితే జోషిమఠ్ కేంద్రంగా ఉన్న ఆర్మీ హెలిప్యాడ్, దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో అధిక మొత్తంలో మట్టిని తవ్వడంతో.. జోషిమత్– ఔలీ రహదారికి సమీపంలో 2,180మీటర్ల ఎత్తులో ఈ క్షీణత ప్రభావం అధికంగా ఉందని ఇస్రో వెల్లడించింది. గతేడాది ఏప్రిల్- నవంబర్ మధ్య కాలంలో ఇక్కడ 9 సెంటీమీటర్ల మేర మునిగిపోయింది వెల్లడించింది. బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రం ఉన్న పట్ణణంలో ఆలయాలు, భవనాలు, రోడ్లు పగుళ్లు ఏర్పడి విపత్తు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది