నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ప్రారంభ వ్యయం రూ.19,744 కోట్లు కాగా, ఇందులో సైట్ (ఎస్ ఐ జి హెచ్ టి)  కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, పైలట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, పరిశోధన, అభివృద్ధి కోసం రూ.400 కోట్లు, ఇతర మిషన్ భాగాలకు రూ.388 కోట్లు కేటాయించారు. సంబంధిత కాంపోనెంట్ ల అమలు కోసం ఎంఎన్ ఆర్ ఈ పథకం మార్గదర్శకాలను రూపొందిస్తుంది.

ఈ మిషన్ ఫలితంగా 2030 నాటికి ఈ క్రింది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వస్తాయి:

*దేశంలో 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో సహా సంవత్సరానికి కనీసం 5 ఎం ఎం టి (మిలియన్ మెట్రిక్ టన్నులు) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం

*మొత్తం పెట్టుబడుల్లో రూ.8 లక్షల కోట్లకు పైగా

*ఆరు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన

*శిలాజ ఇంధన దిగుమతుల్లో రూ. లక్ష కోట్ల తగ్గుదల

*వార్షిక గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్లో దాదాపు 50 ఎం ఎం టి ల తగ్గింపు

గ్రీన్ హైడ్రోజన్ , దాని ఉత్పన్నాలకు ఎగుమతి అవకాశాలను సృష్టించడం వంటి విస్తృత ప్రయోజనాలను మిషన్ కలిగి ఉంటుంది; పారిశ్రామిక, చలనశీలత , ఇంధన రంగాల డీకార్బోనైజేషన్; దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాలు,ఫీడ్ స్టాక్ పై ఆధారపడటాన్ని తగ్గించడం; దేశీయ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం; ఉపాధి అవకాశాల కల్పన; ఇంకా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి. భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి కనీసం 5 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది,

అనుబంధ పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని సుమారు 125 గిగావాట్లను జోడిస్తుంది. 2030 నాటికి రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. 2030నాటికి సంవత్సరానికి దాదాపు 50 ఎంఎంటి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చని భావిస్తున్నారు.

గ్రీన్ హైడ్రోజన్ కు డిమాండ్ సృష్టించడం, ఉత్పత్తి, వినియోగం , ఎగుమతిని ఈ మిషన్ సులభతరం చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ కోసం వ్యూహాత్మక ఇంటర్వెన్షన్స్ (ఎస్ ఐ జి హెచ్ టి) కింద, ఎలక్ట్రోలైజర్ల దేశీయ తయారీ,  గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని రెండు విభిన్న ఆర్థిక ప్రోత్సాహక యంత్రాంగాలు మిషన్ కింద అందించబడతాయి.

అభివృద్ధి చెందుతున్న తుది వినియోగ రంగాలు, ఉత్పత్తి మార్గాలలో పైలట్ ప్రాజెక్టులకు కూడా మిషన్ మద్దతు ఇస్తుంది. పెద్ద ఎత్తున హైడ్రోజన్ ఉత్పత్తి మరియు/లేదా వినియోగానికి మద్దతు ఇవ్వగల ప్రాంతాలను గ్రీన్ హైడ్రోజన్ హబ్ లుగా గుర్తిస్తారు. అభివృద్ధి చేస్తారు.

గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ స్థాపనకు మద్దతు ఇవ్వడానికి వీలైన విధాన యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తారు. దృఢమైన ప్రమాణాలు ,నిబంధనల ఫ్రేమ్ వర్క్ ను కూడా అభివృద్ధి చేస్తారు. ఇంకా, ఈ మిషన్ పరిశోధన-అభివృద్ధి (వ్యూహాత్మక హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్టనర్ షిప్ – షిప్) కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ఫ్రేమ్ వర్క్ ను సులభతరం చేస్తుంది; ఆర్ అండ్ డి ప్రాజెక్టులు లక్ష్య-ఆధారితమైనవి, కాలపరిమితితో కూడినవి.ప్రపంచవ్యాప్తంగా పోటీ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి తగిన విధంగా ఉంటాయి.

మిషన్ లక్ష్యాలను విజయవంతంగా సాధించడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు,సంస్థలు కేంద్రీకృత ,సమన్వయ చర్యలు తీసుకుంటాయి. మిషన్ మొత్తం సమన్వయం,అమలు కు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది.