ఇక్రిశాట్ విద్యార్ధికి అమెరికా అవార్డు

వ్యవసాయరంగంలో పంటలను ఆశించే క్రిమికీటకాల నివారణకు ఉపయోగించే బయోఇన్‌సెక్టిసైడ్‌ను రూపొందించిన విద్యార్ధికి అమెరికా అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన సర్వేష్ ప్రభు ఇక్రిశాట్ సంస్థ సహాకారంతో రాఫల్‌గాంగా ప్రసిద్ది చెందిన ఎద్దుల గుండె ఆకులనుండి తక్కవ ఖర్చుతో బయోఇన్‌సెక్టిసైడ్‌ను అభివృద్ది పరిచాడు. 

అమెరికాలోని అంట్లాంటాలో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రీకాలేజి సైన్స్ ఫెయిర్‌లో తన పరిశోధనను ప్రదర్శించారు. ఈ ఫెయిర్‌లో ఇండియానుంచి ప్రాతినిధ్యం వహించిన సర్వేష్ ప్రభు పరిశోధన అంశానికి మూడవ బహుమతి లభించింది. 

ఈ సందర్భంగా శనివారం ఇక్రిశాట్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ రిసెర్చ్ డా. అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఇన్సిట్యూట్ యువతను వ్యవసాయ పరిశోధనలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. అనోనా రెటిక్యులాటా ఆకులు జీవ క్రిమి సంహారక లక్షణాలను ప్రదర్శించినట్టు తెలిపారు. 

సాంప్రదాయకంగా ఈ మొక్క వివిధ భాగాల సారాలను విరేచనాలు ,పెడిక్యులోసిస్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారని చెప్పారు. దాని ఆకుల నుంచి సేకరించిన మూడు వినాశకరమైన తెగుళ్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనం వెల్లడించిదని పేర్కొన్నారు. 

ఇక్రిశాట్ ఎల్లప్పుడూ సర్వేష్ ప్రభు వంటి యువ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించడానికి, భవిష్యత్ తరానికి స్థిరమైన ఆహార వ్యవస్థను నిర్మిరించడానికి వారి ప్రయత్నాల్లో మద్దతుగా నిలుస్తుందన్నారు. ఎద్దు గుండె మొక్క రసం తక్కువ ఖర్చుతోనే కీటకనాశనిగా ఉపోయోగపడుతుందని తెలిపారు. 

చిన్న కమతాల రైతులకు సరసమైన పురుగుమందుగా ఉపయోగపడుతుందని చెప్పారు. మానవ వినియోగానికి పండ్లు, బయోపురుగుమందుల సారానికి ఆకులను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని అందిస్తుందని డా.అరవింద్ కుమార్ పేర్కొన్నారు.