భారత్‌ను బలవంతంగా చర్చలకు కూర్చోబెట్టేందుకు ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించలేరంటూ పాకిస్తాన్‌పై భారత విదేశాంగ శాఖామంత్రి జై శంకర్ విరుచుకు పడ్డారు. సైప్రస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘భారత్‌ను చర్చలకు బలవంతం చేసేందుకు ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని మేం అనుమతించం’ అని స్పష్టం చేశారు.
“మేం పొరుగువారితో సత్సంబంధాలను కోరుకుంటాం. అయితే మంచి పొరుగు సంబంధాలు అంటే.. పొరుగుదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాదాన్ని క్షమిస్తామని అర్థం కాదు. ఉగ్రవాదం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాము. ఇక రెండవది దేశ సరిహద్దుల విషయంలో సవాళ్లు ఉన్నాయి. అవి కరోనా కాలంలో మరింత తీవ్రమయ్యాయి” అని తెలిపారు.
“మేం ఉగ్రవాదాన్ని చర్చల వేదిక వద్దకు తీసుకువచ్చే అవసరం కల్పించడాన్ని ఎప్పటికీ అనుమతించం” అని జైశంకర్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదంతో భారత్ పడినంతగా ఏ దేశం బాధపడలేదని గుర్తు చేశారు. అదే సమయంలో చైనాకు కూడా ఘాటైన సందేశాన్ని పంపుతూ ఉగ్రవాదాన్ని సాధారణీకరించబోమని, హేతుబద్ధీకరించబోమని చాలా స్పష్టంగా చెప్పామని ఆయన పేర్కొన్నారు.
చైనాతో సరిహద్దు సమస్యలపై జై శంకర్ స్పందిస్తూ ప్రస్తుతం చైనాతో మన సంబంధాలు సాధారణంగా లేవని అందరికీ తెలుసని చెబుతూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి)ని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాన్ని తాము అంగీకరించమని హెచ్చరించారు. జాతి భద్రత, విదేశాంగ విధానంలో భారత్ దృఢవైఖరితో వ్యవహరిస్తోందని ఆయన తేల్చి చెప్పారు.
కరోనా సమయంలో సవాళ్లు తీవ్రమయ్యాయని పేర్కొంటూ ఈ మధ్య అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా, భారత దళాలు ఘర్షణ పడ్డాయని గుర్తు చేశారు. ‘కరోనా సమయంలో మా సరిహద్దుల్లో మాకు సవాళ్లు ఉన్నాయి. చైనాతో సంబంధాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఎల్ ఏసీని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నానికి మేము అంగీకరించము’అని ఆయన స్పష్టం చేశారు.
కాగా, సైప్రస్‌తో మూడు ఒప్పందాలపై భారత్ చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. రక్షణ కార్యకలాపాల సహకారం, వలసలు, ఇరు దేశాల ప్రజలకు చట్టపరమైన ఆంక్షల్ని సులభతరం చేయడానికి అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జైశంకర్ తెలిపారు.
అలాగే విదేశాల్లో ఉండే భారతీయులహొగురించి ఆయన మాట్లాడుతూ ‘విదేశాల్లో ఉండే భారతీయులు అంటే భారతీయ కుటుంబాల్లో భాగమైన పౌరులే. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విదేశాల్లో ఉండే భారతీయులు దేశానికి గొప్ప బలం అని చెప్పాం. ఎక్కువ మంది భారతీయలు బయటకు వెళ్లే కొద్దీ, గ్లోబల్ వర్క్‌ప్లేస్ పెరుగుతుంది’ అని తెలిపారు.
ప్రస్తుతం సుమారు 3.3 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివశిస్తున్నారని చెబుతూ వీరందరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భారత్‌కు ఉందని జైశంకర్ చెప్పారు. ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో భారతీయులు ఎక్కడ కష్టాల్లో ఉంటే.. అక్కడ భారత ప్రభుత్వం వారికి అండంగా ఉందని ఆయన గుర్తు చేశారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
గాజాలో 19న మొదటి విడత బందీల విడుదల!