వలస ఓటర్లకు రిమోట్ ఓటింగ్ మిషన్  

జీవనోపాధి కోసం ప్రజలు వివిధ ప్రాంతాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా వారి స్వస్థాలకు రావాల్సి వుంటుంది. ఒక్కోసారి కుదరకపోవచ్చు. దేశంలో మూడోవంతు ఓటర్లు పోలింగ్‌కు దూరంగానే ఉంటున్నారు.  
 
దీంతో ఓటర్లు తమ హక్కుని ఎక్కడినుండైనా వినియోగించుకునేలా రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్‌విఎం) తీసుకురానున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి)  ప్రకటించింది.  ఆర్‌విఎం నమూనాని సిద్ధం చేసినట్లు తెలిపింది.  ఒకే పోలింగ్‌ బూత్‌ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్‌విఎం)ను అభివృద్ధి చేశారు. జనవరి 16న ఈ నమూనా మిషన్‌ ప్రదర్శన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకునేవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం గగనమే.. ఆసక్తి లేకనో లేదా ప్రయాణ ఖర్చులు భరించలేకనో చాలా మంది ఓటు కోసం ఊరెళ్లరు.
 
రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ను అమల్లోకి తెచ్చేముందు  ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఇసి వివరించింది. ఇందుకోసం రాజకీయ పార్టీల అభిప్రాయాల కోరనున్నట్లు పేర్కొంది. 
 
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును బలోపేతం చేయడానికి, ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేసేందుకు ఇది ముఖ్యమైన చొరవగా ఎన్నికల కమిషన్‌ చీఫ్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇవి అమల్లోకి వస్తే వలసదారుల్లో సామాజిక మార్పుకి అవకాశం కలుగుతుందని  చెప్పారు.  మొత్తం 
 
దేశవ్యాప్తంగా ఉన్న వలసల్లో గ్రామల నుండి అత్యధికంగా ఉన్నాయని,  అంతర్గత వలసలు (దేశంలోనే ఇతర రాష్ట్రాలకు) 85 శాతంగా ఉందని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. విద్య, పెళ్లి, ఇతర అవసరాల దృష్ట్యా వలసలు వెళ్లేవారు అత్యధికంగా ఉంటారని పేర్కొన్నారు.
 
2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. సుమారు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. 
 
అందుకే ఈ రిమోట్‌ ఓటింగ్‌పై   దృష్టిపెట్టామని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇది అమల్లోకి వస్తే ఎన్నికల సమయంలో వలస ఓటర్లు ఎక్కడైనా ఓటు వేసే అవకాశం లభిస్తుంది. 
 
ఈ రిమోట్‌ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఓ కాన్సెప్ట్‌ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ నమూనాను రూపొందించింది. ”2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు” అని తెలిపింది. 
 
“అంతర్గత వలసల (దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు) కారణంగా ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారే” అని ఈసీ ఆ ప్రకటనలో వివరించింది.