ఉక్రెయిన్ పై రష్యా మారణహోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా సైనిక దాడుల్లో వందలాది మంది అమాయకులు మరణించారు. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొన్నటివరకు పుతిన్ శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు మొగ్గుచూపే అవకాశం ఉందని అందరూ భావించారు.
కానీ రష్యా అధ్యక్షుడు అందరి అంచనాలను పటాపంచలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా రష్యా క్షిపణి దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై 120కి పైగా క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడ్ ల్యాక్ ప్రకటించారు.
కీవ్ లో 90 శాతానికి పైగా కరెంట్ సరఫరా నిలిచిపోయిందని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని ఎల్విన్ మేయర్ ఆండ్రీ సడోవి చెప్పారు. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా రష్యా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్‌ను చుట్టుముట్టి మిసైల్స్‌తో రష్యా విరుచుకుపడింది.
ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా ఎయిర్ రెయిడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ రష్యా దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలు, మౌళికసదుపాయాలనే రష్యా లక్ష్యం చేసినట్లు మైఖేల్ పొడోయాక్ తెలిపారు. ఈ దాడిలో కనీసం ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది.
కీవ్‌లో క్షిపణులు పడినట్లు ఆ నగర మేయర్ విటాలీ క్లిచ్‌కోవ్ తెలిపారు. ఖార్కీవ్, ఒడిసా, లివివ్, జైటోమిర్ నగరాల్లోనూ భారీ స్థాయిలో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో మిస్సైల్ అటాక్ జరిగినట్లు ఒడిసా ప్రావిన్సు నేత మాక్సిమ్ మార్చెంకో తెలిపారు. వివిధ దిశల నుంచి వైమానిక, నౌకా స్థావరాల మీదుగా క్రూయిజ్ మిస్సైళ్లను రష్యా వదిలినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది. కమికేజ్ డ్రోన్లను కూడా వాడినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది.
మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే 90 శాతానికిపైగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని.. ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ అప్రమత్తం చేశారు.
More Stories
హసీనా మేనకోడలు బ్రిటన్ మంత్రిగా రాజీనామా
ఎట్టకేలకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యేల్ అరెస్ట్
100 `నాసిరకపు’ పారిస్ ఒలింపిక్ పతకాలు వాపస్