తెలంగాణ సాగునీటి పథకాలపై జగన్ కేంద్రంకు ఫిర్యాదు 

ముఖ్యమంత్రి వైఎస్  కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ను కలసి తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు.  కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఈ రెండు ఏళ్లలో సీజన్‌ తొలి రోజు (జూన్‌ 1) నుంచే విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించిందని తెలిపారు.

శ్రీశైలం జలాశయంలో కనీస నీటి స్ధాయి 834 అడుగులు కంటే తక్కువగా ఉనుప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి నీటి విడుదల చేయడంతో పాటు, కెఆర్‌ఎంబి ముందు కనీసం ఎలాంటి ఇండెంట్‌ కూడా లేకుండానే ఏకపక్షంగా నాగార్జున సాగర్‌, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటి విడుదల చేసిందని తెలిపారు.

విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని చెప్పారు. శ్రీశైలంలో జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప, పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదని వివరించారు.

పోతిరెడ్డిపాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నైకి తాగు నీరు అందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3 టిఎంసిలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తోందని తెలిపారు.

ఈ ప్రాజెక్టుల వల్ల రిజర్వాయరు నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన నీటిని వాడుకోవడానికి కూడా సాధ్యపడదని వివరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం(ఆర్‌ఎల్‌ఎస్‌)ను అమలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. దీనిద్వారా రోజుకు 3 టింఎసిల నీటినిటిజిపి, ఎస్‌ఆర్‌బిసి, జిఎన్‌ఎస్‌ఎస్‌లకు సరఫరా చేయగలుగుతామని చెప్పారు.

కాగా, రాయలసీమ ఎత్తిపోతల నీటి పారుదల పథకానికి సంబంధించిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కృష్టా నదిపై ఉన్న ఆయా ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.