చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సాయుధ దళాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు టార్గెట్ని ఛేదించే అవకాశం ఉంది.
వీటి నుంచి శత్రువులు తప్పించుకోవడం అసాధ్యం భావిస్తున్నారు. ఈ క్షిపణులను చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించనున్నట్టు తెలుస్తోంది. మిస్సైల్స్‌ను మొదట వైమానిక దళంలో చేర్చనున్నారు. సమాచారం ప్రకారం.. ఉన్నత స్థాయి సమావేశంలో సాయుధ దళాల కోసం 120 క్షిపణులను కొనుగోలు చేయడానికి, సరిహద్దుల వెంట మోహరించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించినట్లు సమాచారం.
ఈ బాలిస్టిక్ క్షిపణికి చైనా బాలిస్టిక్ క్షిపణులను పూర్తిగా ఎదుర్కోగల సామర్థ్యం ఉందనే సమాచారం అందుతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన క్షిపణిని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. సైన్యం కోరుకుంటు మిస్సైల్ పరిధిని మరింత పెంచనున్నట్లు తెలుస్తున్నది.
అత్యంత కీలకమైన వ్యూహాత్మక పరిస్థితుల్లో బాలిస్టిక్ మిస్సైల్స్‌ను రంగంలోకి దింపాలని భారతదేశం విధాన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏకకాలంలో ఇన్ని క్షిపణులను సమీకరించుకునేందుకు నిర్ణయం తీసుకుందని రక్షణ వర్గాల సమాచారం మేరకు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పటికే చైనా, పాకిస్థాన్‌ల వద్ద బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. దీనికి ప్రతిగా భారత్ వీటిని సమీకరించుకుంటుంది. తొలుత ఈ ప్రళయ్ క్షిపణులను భారతీయ వాయు సేనలోకి ఆ తరువాత సైన్యంలోకి ప్రవేశపెడుతారు.
2015 నుంచి మిస్సైల్ సిస్టమ్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్నది. దివంగత ఆర్మీ చీఫ్ స్టాప్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వీటిని ప్రోత్సహించారు. సెమీ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు. ఇంటర్ సెప్టర్ క్షిపణులను తప్పించుకోగల సామర్థ్యం ఉన్నది.
శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పూర్తిగా ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. ఇక.. సూపర్‌సోనిక్ క్షిపణులతో దీర్ఘ-శ్రేణి వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను రూపొందించడానికి బ్రహ్మోస్ మొబైల్ లాంచర్ నుంచి సైతం వీటిని ప్రయోగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
More Stories
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
పోలీసుల మధ్య కాల్పులు .. ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులు మృతి
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ఆంక్షల సడలింపు