చైనా సరిహద్దులో ఐఏఎఫ్‌ గరుడ్‌ కమాండోల మోహరింపు

చైనా సరిహద్దులో భారత నావికాదళంకు చెందిన గరుడ్‌ కమాండోలను మోహరించారు. ఈ ప్రత్యేక దళం లడఖ్‌ నుంచి అరుణాచల్‌ వరకు సిగ్‌ సాయర్‌ వంటి ఆయుధాలతో పహారా కాస్తుంది. చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) తో ప్రతిష్టంభన నేపధ్యంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) కు దగ్గరగా ఈ కమాండోలను భారత వైమానిక దళం మోహరించింది.
తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ సమీపంలో అపాచీ దాడి హెలికాప్టర్లు, చినూక్ హెవీ-లిఫ్ట్ ఛాపర్లను ఐఏఎఫ్‌ మోహరించింది. గరుడ్ ప్రత్యేక దళాల విభాగం ఎంఐ-17 హెలికాప్టర్ల నుంచి కసరత్తులు చేపట్టింది. 12వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా ఎల్‌ఏసీలో ఘర్షణ పాయింట్లలో ఒకటైన గోగ్రా వద్ద భారత్-చైనా దళాలు వెనక్కి వెళ్లిపోవాలని గత వారం నిర్ణయించాయి.

ఈ ఏడాది ప్రారంభంలో, తూర్పు లడఖ్‌లోని పాంగ్యాంగ్ త్సో సరస్సు నుంచి కూడా ఇరుపక్షాలు తమ దళాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గరుడ్‌ కమాండోలకు అమెరికన్ సిగ్ సాయర్ అసాల్ట్ రైఫిల్ వంటి ఆయుధాలను భారత వైమానిక దళం సమకూర్చింది.

వీటితోపాటు గలీల్ స్నిపర్ రైఫిల్స్, ఇజ్రాయెలీ ట్వెర్ రైఫిల్స్, 800-1000 మీటర్ల పరిధిలో శత్రు సైనికులను పడగొట్టగల నెగెవ్ లైట్ మెషిన్ గన్స్ ఉన్నాయి. ఏకే-103 లను కూడా గరుడ కమాండోలకు అందించారు.  గరుడ్‌ కమాండోలు జమ్ముకశ్మీర్‌లో బ్లడ్‌ హజిన్‌ ఆపరేషన్‌ను నిర్వహించి ఫోర్స్‌ నెగెవ్‌ ఎల్‌ఎంజీని ఉపయోగించాయి. ఈ సందర్భంగా ఐదుగురు ఉగ్రవాదులను గరుడ్‌ బృందం హతమార్చింది.