బుగ్గన ఆర్థిక మంత్రి కాదు… అప్పుల మంత్రి అని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. అప్పులు తేవడంలో ఆర్ధిక మంత్రి బుగ్గన దిట్ట అని ఆయనకు కృతజ్ఞతలు అంటూ యెద్దేవా చేశారు. హత్య చేసిన వ్యక్తికి ర్యాలీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ, తక్షణమే ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం వైసీపీ అరాచకాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డాయిరు. జగనన్న సంబరాలు ఇక ఒక ఏడాదిన్నర వరకే ఉంటాయని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. జగన్‌ను ఎన్నుకోవడం ప్రజల దురదృష్టమని చెబుతూ జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందని తెలిపారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ శ్వేతపత్రం ప్రకటించాలని మాజీ ఎమ్యెల్యే డిమాండ్ చేశారు. జగన్ అప్పుల ముఖ్యమంత్రి అని పేర్కొంటూ నల్లధనంలో ఏపీ నెంబర్ వన్ చేసిన ఘనత వైసీపీ నేతలదే అని విమర్శించారు. ఋషికొండ విధ్వంసం చేశారని… బోడి గుండు కొట్టించారని మండిపడ్డాయిరు. ఈ కారణంతో హుద్ హుద్ తుపానులు లాంటివి వస్తే విశాఖ ప్రమాదంలోకి వెళుతుందని ఆయన హెచ్చరించారు.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
ప్రకాశం బ్యారేజ్ దిగువన మరో రెండు బ్యారేజీలు!
విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ. 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ!