`స్వయం పాలనలో స్థానిక నమూనాలు’ అంశంపై సదస్సు 

కర్ణాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ విశ్వవిద్యాలయం, ఐసీసీఆర్,  కర్ణాటక ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ  సహకారంతో ప్రజ్ఞా ప్రవాహ “స్వరాజ్: స్వయం పాలన లో స్థానిక నమూనాలు అనే అంశంపై మార్చి 1-3 తేదీలలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నారు. 

విద్య, న్యాయం, పరిపాలన, దేవాలయాల వంటి స్థానిక యూనిట్ల స్వయం పాలన నిర్మాణాలను వలస పాలకులు స్వాధీనం చేసుకుని దోపిడీకి గురి చేశారు. దీని ఫలితంగా అనేక దేశాలలో క్రమంగా స్వయంపాలన పతనమైంది. ప్రస్తుత క్లిష్టసమయంలో ప్రపంచం మొత్తం అభివృద్ధి, పాలనలకు తగు ప్రత్యామ్నాయ నమూనాలను అన్వేషిస్తోంది. 
 
దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి దేశం స్వయం సమృద్ధి, స్వయంప్రతిపత్తి, పరస్పర సహకారం ఆధారంగా తమ, తమ  స్వంత నమూనాలను అభివృద్ధి చేసుకోవాలి. స్వరాజ్య తాత్విక ఆలోచన ఈ దిశలో మార్గంగా పనిచేస్తుంది.

భారత్‌లో స్వయం పాలన అనేది సాధారణ పాలన. గుప్త, చోళ రాజవంశాలు అందుకు ఉత్తమ ఉదాహరణలు. రెండు రాజ్యాలలో గ్రామాలు ప్రాథమిక పరిపాలనా యూనిట్లుగా ఏర్పడ్డాయి. చోళ గ్రామాలు అసాధారణంగా స్వయంప్రతిపత్తి కలిగి ఉన్నాయి. గ్రామ పరిపాలనలో అధికారుల పాత్ర నియంత్రణ కన్నా సలహాదారు, పరిశీలకుడి పాత్రగా ఉండెడిది. 
 
పర్యవసానంగా, ఎగువ స్థాయిలో జరిగే రాజకీయ మార్పుల ప్రభావంతో సంబంధం లేకుండా  స్థానిక స్థాయిలో వృద్ధి, అభివృద్ధిలో కొనసాగేవి. సాధారణ సాంస్కృతిక కొనసాగింపు, సంపన్నంగా ఉండడానికి కూడా ఇదొక్క కారణం. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వరాజ్య స్వయం-పరిపాలన నమూనాల గురించి బలమైన విద్యాసంబంధమైన సమాలోచనలు నిర్మించడం ఈ సదస్సు లక్ష్యం. పంచ మహాభూతం, ధర్మం, సురాజ్య (మంచి పాలన), స్వాస్త్య (ఆరోగ్యం, పాలన), అభ్యుదయ (ఆర్థికశాస్త్రం) అనే ఐదు ప్రధాన ఇతివృత్తాలు, ఉప ఇతివృత్తాలపై పరిశోధనా పత్రాలు, కేస్ స్టడీస్, ప్రసంగించే వారిని ఆహ్వానించడం ద్వారా ఈ సమావేశం స్వయం పాలన, అభివృద్ధిలకు సంబంధించి  వివిధ రూపాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుంది. 

ఈ సమావేశంలో, జె ఎన్ యు, ఐఆర్ఎంఎ,  చాణక్య విశ్వవిద్యాలయం, ప్రపంచ యువజన సంస్థ, శ్రీ అరబిందో సొసైటీ, ఐఎఫ్ఐఎం, ఉన్నత్ భారత్ అభియాన్ మొదలైన వివిధ ప్రధాన సంస్థలు నాలెడ్జ్ పార్టనర్‌లుగా వ్యవహరిస్తున్నాయని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్  చంకెల్లర్ ప్రొఫెసర్ విష్ణుకాంత్ చాటుపల్లి తెలిపారు. 
 
కర్ణాటకలోని గడగ్‌లో జరిగే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, రీసెర్చ్ స్కాలర్‌లు, విధాన రూపకర్తలు, అభ్యాసకులు పాల్గొంటారు. వివిధ విశ్వవిద్యాలయాలలో వ్యాసరచన, క్విజ్ పోటీలు, సెమినార్లు వంటి అనేక ప్రీ కాన్ఫరెన్స్ ఈవెంట్‌లను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు.