వివాదంలో పఠాన్ సినిమా ..  నిషేధంకై ఒత్తిడి 

బాలీవుడ్ అగ్ర నటులు షారుక్ ఖాన్, దీపికా పదుకొణే నటించిన పఠాన్ సినిమా వివాదంలో చిక్కుకుంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న పఠాన్ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా  నుంచి రిలీజైన బేష‌రమ్ రంగ్ పాట  వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 
 
ఈ పాట‌లో దీపికా ధ‌రించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంత‌రంతో పాటు అశ్లీలం మోతాదు మించింద‌ని, ప‌ఠాన్ సినిమాను నిషేధించాలనే డిమాండ్‌ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ పాటలో కాషాయ రంగు బికినీలతో దీపికా ఎక్కువగా కానిపించడం ఆమె  అభిమానులకు సహితం నచ్చడం లేదు. 
“హిందువులకు పవిత్రమైన కాషాయ దుస్తువులను అసభ్యంగా, అర్ధనగ్నంగా దీపికా ధరించి పాటలో నటించడం తీవ్ర అభ్యంతరకరం” అంటూ నెటిజెన్ పేర్కొన్నారు.  అటువంటి దృశ్యాలను చిత్రం నుంచి తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 
అంత చావుకబారుగా ఆమె వస్త్రధారణ ఉండడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంభం సభ్యులతో కలసి ఇటువంటి సన్నివేశాలు గల సినిమాను చూడలేమని స్పష్టం చేస్తున్నారు. దిగవంత నటుడు  సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు సహితం ఈ సినిమాను నిషేధించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్తం మిశ్రా కోరారు. ఈ సినిమాలో కాషాయ దుస్తుల‌ను వాడటం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర సీన్లు ఉన్నాయ‌ని, ఈ సీన్ల‌ను మార్చ‌నిప‌క్షంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పఠాన్ సినిమాను నిషేధిస్తుందని ఆయన  హెచ్చ‌రించారు. 
 
సినిమాలో అభ్యంత‌ర‌కరంగా ఉన్న కాస్ట్యూమ్స్‌ను, వివాదాస్ప‌ద సీన్ల‌ను మార్చ‌ని ప‌క్షంలో రాష్ట్రంలో ప‌ఠాన్ స్క్రీనింగ్‌ను అడ్డుకుంటామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. బేష‌ర‌మ్ పాట‌లో కాస్ట్యూమ్స్ తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని, ఈ సాంగ్‌ను చ‌వ‌క‌బారు మైండ్‌సెట్‌తో చిత్రీక‌రించార‌ని మండిపడుతూ మిశ్రా ట్వీట్ చేశారు.