జగన్ పాలనలో ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు

సీఎం జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉందని కేంద్రం తెలిపింది. 
 
దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినా.. ఏపీతో పాటు మరో రెండు మూడు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిచ్చారు.
 
కర్నాటక, మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికగా రైతుల ఆత్మహత్యలు చేసుకున్నాని తెలిపారు. టీడీపీ హయాంలో 2017లో 375 మంది, 2018లో 365 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 
 
జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తోమర్ వివరించారు. అయితే, తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. 2017లో తెలంగాణాలో 846 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. 2021 నాటికి 352కు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తోమర్ తెలిపారు.