భారత్ స్టార్ట్‌ప్‌ కంపెనీలకు అబుదాబీ ఎర్ర తివాచీ

భారత దేశం నుంచి యూఏఈ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా అబుదాబీలో వ్యాపారాలు ప్రారంభించాలని భారతీయ  పారిశ్రామికవేత్తలను కోరుతోంది. ముఖ్యంగా మన దేశానికి చెందిన స్టార్ట్‌ప్‌ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తోంది. 
 
భారతీయుల  పెట్టుబడులతో స్థానిక ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు, ఆయా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని చెబుతోంది. అబుదాబీలో ప్రధానంగా అగ్రిటెక్‌, టూరిజం, హెల్త్‌కేర్‌, ఫార్మా, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాల్లో భారత్‌ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని యూఏఈ కోరుతోంది.
భారత్‌, యూఏఈ మధ్య పెరుగుతున్న సంబంధాల మూలంగా భారతీయ పెట్టుబడులకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీస్‌ (ఏడీఐఓ) యాక్టింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అబ్దుల్లా అబ్దుల్‌ అజీజ్‌ అల్సమ్సీ చెప్పారు. భారతీయ కంపెనీలు యూఏఈలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వారు వ్యాపారం చేసుకునేందుకు ఇదో వేదకగా పనికి వస్తుందని పేర్కొన్నారు.
మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో యూఏఈ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ముఖ్యంగా స్టార్ట ప్‌ కంపెనీలు అబుదాబీలో బిజినెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరింది.